Avatar 2: బిలియన్ డాలర్ మార్క్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న అవతార్ 2!

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌ను తన సినిమా కోసం వెయిట్ చేసేలా చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ అవతార్ 2 మూవీని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు ఎదురుచూడగా, డిసెంబర్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Avatar 2: బిలియన్ డాలర్ మార్క్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న అవతార్ 2!

Avatar 2 To Enter Billion Dollar Club Today

Avatar 2: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌ను తన సినిమా కోసం వెయిట్ చేసేలా చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ అవతార్ 2 మూవీని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు ఎదురుచూడగా, డిసెంబర్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Avatar 2 : అవతార్ మొదటి రోజు కలెక్షన్స్.. ఆ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్..

ఈ సినిమాను తొలి భాగం కంటే కూడా ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాడు జేమ్స్ కామెరాన్. అయితే ఈ సినిమాకు తొలిరోజునే సూపర్ రెస్పాన్స్ దక్కడంతో, ఈ విజువల్ ఫీస్ట్‌ను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. కలెక్షన్ల పరంగా ఈ సినిమా తొలిరోజే పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా డిసెంబర్ 28న ఓ మైల్‌స్టోన్ మార్క్‌ను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు ఈరోజున 1 బిలియన్ డాలర్ మార్క్‌తో దుమ్ములేపుతున్నాయి.

Avatar 2: తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్‌తో దుమ్ములేపిన అవతార్-2

ఈ సినిమాను చూసేందుకు ఇంకా ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తుండటంతో ఈ మూవీ ఫుల్ రన్‌లో ఎలాంటి కలెక్షన్స్‌ను రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న అవతార్ 2 మూవీకి ఇండియాలోనూ ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాకు గ్లోబల్ ఆడియెన్స్ పట్టం కట్టడంతోనే ఈ అరుదైన ఫీట్‌ను అవతార్-2 సాధించిందని చిత్ర యూనిట్ అంటోంది.