Balakrishna: బాలీవుడ్‌లో బాలయ్య తాండవం.. అఖండ వచ్చేస్తున్నాడు!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తాండవం ఆడిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలయ్య పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి.

Balakrishna: బాలీవుడ్‌లో బాలయ్య తాండవం.. అఖండ వచ్చేస్తున్నాడు!

Balakrishna Akhanda Movie Hindi Release On Jan 20th

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తాండవం ఆడిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలయ్య పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి.

Akhanda: బాలయ్య శివతాండవానికి ఏడాది పూర్తి!

ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. బోయపాటి మాస్ అంశాలను దైవత్వానికి జోడించి, ఈ సబ్జెక్ట్‌ను మలిచిన తీరు అందరికీ నచ్చింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాతో ఇప్పుడు మరోసారి తాండవం చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. ఈసారి బాలీవుడ్‌లో అఖండ ఆగమనం ఖాయమైంది.

Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?

అఖండ చిత్రాన్ని బాలీవుడ్‌లో జనవరి 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మేరకు తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఇక ఈ క్రమంలోనే రేపు అఖండ హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు వారు ప్రకటించారు. థమన్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మరి బాలయ్య తన నటవిశ్వరూపంతో చేసిన తాండవానికి బాలీవుడ్ జనాలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.