Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు’ అంటూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇచ్చిన మాట ప్రకారం థింకింగ్ మార్చేశారు. బాలయ్య ఏంటి హోస్ట్ ఏంటి అన్న వాళ్ళే..

Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

Unstoppable With Nbk

Unstoppable with NBK: నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు’ అంటూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఇచ్చిన మాట ప్రకారం థింకింగ్ మార్చేశారు. బాలయ్య ఏంటి హోస్ట్ ఏంటి అన్న వాళ్ళే.. బాలయ్య హోస్ట్ చేస్తే ఇలాగే ఉంటది అనేలా తొలి ఎంట్రీని గ్రాండ్ విక్టరీగా మార్చేసుకున్నాడు. అన్ స్టాపబుల్ అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా సెలబ్రిటీలతో ముచ్చట్లు పెడుతూ కామెడీకి కామెడీ.. పంచ్ కి పంచ్ అనేలా తొలి సీజన్ ను గ్రాండ్ సక్సెస్ చేశాడు.

Sai Pallavi : నాగశౌర్య వ్యాఖ్యలపై మూడేళ్ళ తర్వాత స్పందించిన సాయి పల్లవి

ఆహాలో మోహన్ బాబుతో మొదలైన అన్ స్టాపబుల్ షో.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కావాల్సినంత వినోదంతో పాటు ఎమోషనల్ కూడా తోడైంది. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన షో అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ప్రేక్షకుల మనసును తడిపేశాయి. ఎపిసోడ్ అనంతరం.. స్టేజ్‌ మెట్లపై కూర్చొని బాలయ్య చెప్పిన మాటలు కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాయి.

Chiranjeevi : పొద్దున్న షూటింగ్.. రాత్రికి డబ్బింగ్.. స్పీడ్ పెంచిన మెగాస్టార్..

‘నా ఇన్నేళ్ల ప్రస్థానంలో నటుడిగా.. నిర్మాతగా.. శాసనసభ్యుడిగా.. నిజ జీవితంలో ఆయనగారి తనయుడిగా.. అన్నగా.. తమ్ముడిగా.. మీ అందరి బాలయ్యగా.. ఎన్నో భూమికలు. కానీ ‘ఆహా’లో ఈ అన్‌స్టాపబుల్ నా నుంచి మీకు.. మీ నుంచి నాకు.. ఒక కొత్త అనుభవం. ఈ కొత్త ప్రయాణ మార్గంలో మజిలీలు.. విరామాలు ఉండాలి. తప్పటడుగుల్ని తప్పించుకుంటూ మరో మజిలీకి శ్రీకారం చుట్టాలి. అతిథులతో నా ముచ్చట్లు వాటికి మీ చప్పట్లు మధురజ్ఞాపకాలే కాదు.. మరోసారి మీ ముందుకు రమ్మని పిలిచే పిలుపులు కూడా.

Vishnu Vishal : తండ్రి మాట్లాడుతుంటే స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో

మీరు నన్ను వెండితెరపై.. బుల్లితెరపై.. సభల్లోనూ.. శాసనసభల్లోనూ చూస్తారు కానీ.. మిమ్మల్ని నేను ఎలా చూడాలి.. ఎలా కలవాలి? నా ఆనందాన్ని ఎలా పంచుకోవాలి. మీతో ఎలా కబుర్లు చెప్పుకోవాలి.. ఎలా ఆట ఆడించాలి.. ఎలా ఆటపట్టించాలి? అందుకే.. మీరే కాదు.. నా రాకకోసం నేను కూడా ఎదురుచూస్తున్నా. వేదిక మారినా వేడుక మారదు.. మళ్లీ తిరిగి వస్తాను.. అన్‌స్టాపబుల్‌కి ఫుల్ స్టాప్ ఉండదూ.. నేను మీకు తెలుసూ..’ అంటూ బాలయ్య చెమ్మగిల్లేట్టు వ్యాఖ్యలు చేశాడు.