Balakrishna: టాలీవుడ్ హీరోలపై బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ నిన్న(జూన్ 10న) 62వ పుట్టినరోజును జరుపుకున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు....

Balakrishna: టాలీవుడ్ హీరోలపై బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?

Balakrishna Fans Angry On Telugu Heroes For Not Wishing Balayya On His Birthday

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ నిన్న(జూన్ 10న) పుట్టినరోజును జరుపుకున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేశారు. అటు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో ఆయా చిత్ర యూనిట్లు కూడా ఫుల్ ట్రీట్ ఇచ్చాయి. అయితే నందమూరి అభిమానులు మాత్రం టాలీవుడ్ హీరోలపై కోపంతో ఊగిపోతున్నారు. ఇంతకీ వారికి తెలుగు హీరోలు ఏ విషయంలో అంతగా కోపం తెప్పించారా అని అనుకుంటున్నారా? తమ అభిమాన హీరోకు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదని వారందరూ ఇతర హీరోలపై మండిపడుతున్నారు.

Balakrishna : బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు

సాధారణంగా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో అయినా పుట్టినరోజు జరుపుకుంటే, మిగతా స్టార్స్ అదేపనిగా వారి శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఇందులో యంగ్ హీరోలు మొదలుకొని సీనియర్ హీరోల వరకు అందరూ తమ విషెస్‌ను తెలుపుతూ ఉంటారు. అయితే బాలయ్య పుట్టినరోజు నాడు మాత్రం వీరందరూ సోషల్ మీడియాలో కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తమ హీరోకు తెలుపకపోవడంతో వారిపై మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యకు బర్త్‌డే విషెస్ చెప్పకపోవడం గమనార్హం.

Balakrishna : భయం మా బయోడేటాలోనే లేదు.. NBK 107 టీజర్ రిలీజ్..

ఇక యంగ్ హీరోల సంగతి సరేసరి. వారు కూడా బాలయ్యకు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు. ఇదంతా ఒకెత్తయితే.. నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ అయిన బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపకపోవడంతో, బాలయ్య అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇక ఈ హీరోల సంగతి చూసుకుంటామంటూ వారు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ హీరోలు నటించే సినిమాలు రిలీజ్ అయినప్పుడు తమ సత్తా ఏమిటో వారికి చూపిస్తామని వారు ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా బాలయ్య లాంటి ఓ స్టార్ హీరో బర్త్ డేకు విషెస్ చెప్పకపోవడం ఆయన్ను అవమానించినట్లే అంటున్నారు నందమూరి అభిమానులు.