Mokshagna: బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కన్ఫం.. కానీ హీరో కాదట..?

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కన్ఫంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే అతడు హీరోగా కాకుండా కేమియో పాత్రలో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

Mokshagna: బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కన్ఫం.. కానీ హీరో కాదట..?

Balakrishna Son Mokshagna To Debut With This Film

Mokshagna: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతంలోనే తన కొడుకు సినిమాల్లోకి ఖచ్చితంగా వస్తాడని బాలయ్య పేర్కొన్నాడు. దీంతో మోక్షజ్ఞ ఏ సినిమాతో వస్తాడా.. అతడిని డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరా.. ఎలాంటి సినిమాతో ఈ నందమూరి వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడా అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. కానీ, ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో, నందమూరి ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

Nandamuri Mokshagna : బావతో మోక్షజ్ఞ సరదా ముచ్చట్లు.. నారా వారి పల్లెలో సంక్రాంతి సంబరాలు..

తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చాలా త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కించే ఓ సినిమాలో మోక్షజ్ఞ వెండితెరపై మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా చేస్తోన్న బోయపాటి, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మరోసారి బాలయ్యతో చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోక్షజ్ఞ నటిస్తాడనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే ఈ కీలక పాత్ర కోసం మోక్షజ్ఞను తీసుకునేందుకు బోయపాటి ఆసక్తిని చూపుతున్నాడట. కేమియో తరహా పాత్రలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

Nandamuri Mokshagna: శ్యామ్ సింగరాయ్ దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ వెండితెర తెరంగేట్రం.. నిజమేనా?

ఇక ఈ సినిమా తరువాత హీరోగా చేసేందుకు మోక్షజ్ఞ రెడీ అవుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ముందుగా అతిథి పాత్రల్లో నటించి, ఆ తరువాత హీరోగా మారాలని మోక్షజ్ఞ ప్లాన్ చేస్తున్నాడా.. లేక నేరుగా హీరోగానే తెరంగేట్రం చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బాలయ్య-బోయపాటి మూవీని త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.