Bhagavanth Kesari Teaser : ‘భగవంత్ కేసరి’ టీజర్‌కి మొత్తం రెడీ.. ఫ్యాన్స్‌కి సూపర్ సర్‌ప్రైజ్ అంటున్న అనిల్, తమన్.. 108 థియేటర్స్ లో..
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో భగవంత్ కేసరి సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. రేపు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

Bhagavanth Kesari Teaser ready to release on Balakrishna Birthday June 10th
Anil Ravipudi : ప్రస్తుతం బాలయ్య(Balayya) బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veera SimhaReddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్100 కోట్ల సూపర్ హిట్ సినిమాలు సాధించారు. తాజాగా నిన్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న NBK108 సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ని ప్రకటించి అభిమానులలో ఫుల్ జోష్ ని నింపారు.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో భగవంత్ కేసరి సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. రేపు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఈ టీజర్ ఒక నిమిషం 9 సెకండ్స్ ఉండనుంది. దీంతో బాలయ్య అభిమానులు ఈ టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా అనిల్ రావిపూడి చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. భగవంత్ టీజర్ కి మొత్తం రెడీ అయింది. థమన్ ఇచ్చిన BGM అదిరిపోయింది. ఫ్యాన్స్ కి సూపర్ సర్ ప్రైజ్ ఇబివ్వబోతున్నాము అని ట్వీట్ చేశారు. ఇక ఈ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా తెలంగాణ యాసలో తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు రిలీజయ్యే టీజర్ ఇంకెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి.
Yes broooo…..June 10 th….. another BIG SUPRISE loading 🔥🔥🔥🔥…..#bhagavanthkesari
I m still in your MAGNIFICENT BGM Trance brother 🥁🥁🥁🎵🎶🎼 https://t.co/h4CHP6ZOx4 pic.twitter.com/5oqUblVKN9— Anil Ravipudi (@AnilRavipudi) June 8, 2023
Jus checked the Final Content #Bhagavanthkesari is all set for tomorrow same time 🔥@MusicThaman 🎵🙌❤️ pic.twitter.com/cMfDbK2d6s
— Anil Ravipudi (@AnilRavipudi) June 9, 2023
A MASS FEAST to celebrate the birthday of NATASIMHAM #NandamuriBalakrishna 🔥#BhagavanthKesari Grand Teaser Launch on June 10th
in 108 Theatres Worldwide❤️🔥@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna… pic.twitter.com/96Wa4dkJ1r— Shine Screens (@Shine_Screens) June 8, 2023