Bholaa Shankar: పండగపూట మెగాస్టార్ మరో ట్రీట్.. భోళాశంకర్ వచ్చేది అందులోనే!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్లు వచ్చినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

Bholaa Shankar: పండగపూట మెగాస్టార్ మరో ట్రీట్.. భోళాశంకర్ వచ్చేది అందులోనే!

Bholaa Shankar To Stream On This OTT Platform

Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్లు వచ్చినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

Bholaa Shankar : చిరు సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్..

ఇక ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ముందుగా ఉన్న సినిమా భోళాశంకర్. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ బాక్సాఫీస్‌ను రూల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

Bholaa Shankar : మెగాస్టార్‌తో మిల్కీబ్యూటీ

భోళాశంకర్ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో జరగనుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకున్న తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం తెలిపింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేశ్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.