Khushi : 21 ఏళ్ళ తర్వాత.. ఖుషి సాంగ్‌కి డ్యాన్స్ వేసిన భూమిక.. వైరల్ అవుతున్న వీడియో

'ఖుషి' సినిమాలోని అమ్మాయే సన్నగా సాంగ్ కి డ్యాన్స్ చేసిన ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి..''21 సంవత్సరాల తర్వాత ఖుషి సినిమా మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయడానికి ట్రై చేసాను....

Khushi : 21 ఏళ్ళ తర్వాత.. ఖుషి సాంగ్‌కి డ్యాన్స్ వేసిన భూమిక.. వైరల్ అవుతున్న వీడియో

Bhumika

Bhumika :  టాలీవుడ్ లో ఒకప్పుడు భూమిక స్టార్ హీరోయిన్. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది. 2000 సంవత్సరంలో ‘యువకుడు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన భూమిక 2001లో పవన్ సరసన ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో పాటలు అయితే ఇప్పటికీ క్లాసిక్స్. ఈ సినిమాలోని ‘అమ్మాయే సన్నగా..’ పాట అప్పట్లో ఓ సంచలనం.

అయితే తాజాగా భూమిక ఆ సాంగ్ కి డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 21 ఏళ్ల తర్వాత భూమిక ఈ సాంగ్ కి డ్యాన్స్ చేయడం విశేషం. ఆ సాంగ్ కి ఫుల్ జోష్ తో భూమిక డాన్స్ చేసింది. తనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసే తన స్నేహితురాలు సవితతో కలసి ఈ సాంగ్ కి డాన్స్ చేసింది భూమిక. ఈ వీడియోని భూమిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Arpita Khan : 10 కోట్లతో లగ్జరీ ప్లాట్‌ని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ సోదరి

‘ఖుషి’ సినిమాలోని అమ్మాయే సన్నగా సాంగ్ కి డ్యాన్స్ చేసిన ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి..”21 సంవత్సరాల తర్వాత ఖుషి సినిమా మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయడానికి ట్రై చేసాను. నా బెస్ట్ ఫ్రెండ్, నా డబ్బింగ్ ఆర్టిస్ట్ తో కలిసి ఈ సాంగ్ చేసాను. ఇద్దరం చాలా రోజుల నుంచి ప్రయాణిస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు. సవితకి ప్రేమతో” అంటూ తన ఫ్రెండ్ గురించి చెప్తూ పోస్ట్ చేసింది.

Babli Bouncer : మహిళా బౌన్సర్ పాత్రలో తమన్నా

అయితే పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ భూమికని పొగిడేస్తున్నారు. 40 ఏళ్ళ వయసులోనూ అదే క్రేజ్ తో డ్యాన్స్ చేసిందని అభినందిస్తున్నారు. ప్రస్తుతం భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగానే ఉంది.