Bollywood vs Tollywood : బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్.. ఫిబ్రవరిలో క్రికెట్ మ్యాచ్..

దేశంలో ఎన్ని ఆంక్షలు ఉన్నపటికీ చాప కింద నీరులా పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. కాగా నేడు ఈ క్రికెట్ కప్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

Bollywood vs Tollywood : బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్.. ఫిబ్రవరిలో క్రికెట్ మ్యాచ్..

Bollywood vs Tollywood

Bollywood vs Tollywood : దేశంలో అత్యధికంగా ఇష్ట పడేది కేవలం రెండు మాత్రమే. అందులో ఒకటి సినిమా మరొకటి క్రికెట్. ఈ రెండిటిని చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఇష్ట పడుతుంటారు. ఇక ఈ రెండు రంగాలను ఒకటి చేస్తూ సినిమా క్రికెట్ లీగ్ అంటూ గత కొంత కాలంగా సినిమా తారలు క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లు సరదా కోసం కాకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ కోసం ఆడుతూ, దాని ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు మన వెండితెర నటులు.

Nithiin : స్టార్ హీరో నితిన్ చేతుల మీదుగా మణికొండలో ‘బాబాయ్ హోటల్’ ప్రారంభం..

తాజగా ఈ నేపథ్యంలోనే.. దేశంలో ఎన్ని ఆంక్షలు ఉన్నపటికీ చాప కింద నీరులా పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా CCC (క్రెసెంట్ క్రికెట్ కప్) అనే ప్రోగ్రామ్ ని టాలీవుడ్, బాలీవుడ్ తారలు కలిసి చేస్తున్నారు. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ‘సే నో డ్రగ్స్’ అనే అవేరేనెస్ కాంపెయిన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26న Lb స్టూడియం లో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా నేడు ఈ క్రికెట్ కప్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహ్మద్ అలీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాల రాజు, టాలీవుడు హీరోస్ వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, బాలీవుడు టీమ్ కెప్టెన్ హార్భజన్ ఖాన్ హాజరయ్యారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహ్మద్ అలీ కప్ ని లాంచ్ చేసి మాట్లాడుతూ.. దేశంలో క్రికెట్ అంటే చాలా ఇంపార్టెంట్ గేమ్. దానిని వేదికగా తీసుకోని ‘సే నో డ్రగ్స్’ అనే ఒక సోషల్ కాస్ కోసం చేస్తున్న ఈ ఈవెంట్ ని అందరు ప్రమోట్ చేయాలి అంటూ అభిప్రాయపడ్డాడు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 2011 నుండి బాలీవుడు టాలీవుడు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. నేడు సే నో డ్రగ్స్ అంటూ మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ దేశం మొత్తం విస్తరస్తుంది. ఈ క్రమంలో ఇటువంటి ఒక అవేరేనెస్ ప్రోగ్రాం నిర్వహిస్తుంటే, అందు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. హైదరాబాద్ ఒక బ్యూటిఫుల్ సిటీ. హైదరాబాద్ ను కాపాడుకోవాలంటే డ్రగ్స్ ను తరిమి కొట్టాలి అంటూ వ్యాఖ్యానించాడు.