Sonu Sood: సోనూసూద్‌ని కొట్టినందుకు టీవీ పగలగొట్టిన పిల్లాడు

కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్ క్రేజ్ దేశవ్యాప్తంగా కూడా వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులను దక్కించుకున్నారు.

Sonu Sood: సోనూసూద్‌ని కొట్టినందుకు టీవీ పగలగొట్టిన పిల్లాడు

Sonusoos

Sonu Sood: కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్ క్రేజ్ దేశవ్యాప్తంగా కూడా వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులను దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సేవల కారణంగా అభిమానులను దక్కించుకున్న సోనూ కోసం ఓ ఏడేళ్ల బుడ్డోడు టీవీ పగలగొట్టాడు.

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్​లో ఎస్సీ కాలనీకి చెందిన విరాట్ అనే బాలుడు టీవీలో సినిమా చూస్తున్నాడు. ఓ సినిమా విలన్​గా నటించిన సోనుసూద్‌ని హీరో కొట్టే సీన్ చూడగానే విరాట్​కు కోపం వచ్చింది. కరోనా కష్టకాలంలో తీవ్రంగా కొవిడ్ టైంలో అందరినీ ఆదుకున్న సోనూసూద్ అంకుల్​ని కొడతావా అంటూ బయటి నుంచి రాయి తెచ్చి టీవీని పగలగొట్టాడు.

ఈ సంఘటన చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. సీన్లు చూసి టీవీని బద్దలు కొడతావా అని అడిగితే సోనూసూద్ అంకుల్‌ని కొడితే ఊరుకోనంటానా? అని అన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోనూ సూద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.