Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది విరాటపర్వం. ఇటీవలే సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్, గో హత్యలు గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు..........

Virataparvam : రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాటపర్వం సినిమాకి సాయి పల్లవి వాళ్ళ మరింత క్రేజ్ వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే మొదట్లో సినిమాకి అన్ని పాజిటివ్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది విరాటపర్వం. ఇటీవలే సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్, గో హత్యలు గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగి వార్తల్లో నిలిచింది ఈ సినిమా. సాయి పల్లవి వివాదం ఇంకా నడుస్తూనే ఉండగా మరో వివాదం విరాటపర్వం సినిమాని పలకరించింది.
విరాటపర్వం సినిమా నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కింది. అధికారికంగా నక్సలిజాన్ని భారతదేశంలో బ్యాన్ చేశారు. కానీ ఈ సినిమాలో నక్సలిజాన్ని మంచిగా చూపించి పోలీసులని చెడుగా చూపించారు. దీంతో ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. విశ్వ హిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు శనివారం సాయంత్రం ఈ సినిమాపై ఫిర్యాదు చేశారు.
Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
తన ఫిర్యాదులో..”విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉంది. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చాలా అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలి” అని పేర్కొన్నారు. అలాగే నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇచ్చింది అని ప్రశ్నిస్తూ విరాటపర్వం సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై కూడా ఫిర్యాదు చేశారు.
- Konda : సాయి పల్లవికి రెడ్ కార్పెట్ వేసి.. రేవంత్ రెడ్డిని ఆపేసారు..
- Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
- Virata Parvam: విరాట పర్వం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
- Virata Parvam: విరాటపర్వం ప్రెస్ మీట్.. గుండె బరువెక్కిందన్న సాయి పల్లవి!
- Sai Pallavi : సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్..
1Maoist Arrest : మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్-సభ్యులు లొంగుబాటు
2Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ పటిష్ఠ భద్రత: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి
3Revanth Reddy: పీవీ సంస్కరణల వల్లే భారత్ శక్తివంతం: రేవంత్ రెడ్డి
4T Hub 2 In Hyderabad : T-Hub 2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
5Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
6Naga Chaitanya : ఏమున్నాడ్రా బాబు..
7Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్నాథ్ షిండే
8Rupee Vs Dollar: రూపాయి విలువ పతనం.. డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్టానికి
9Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
10Student Flex: ‘పది’ పాసైనందుకు తనకు తానే ఫ్లెక్సీ కట్టించుకున్న విద్యార్థి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్