Chiranjeevi : ఆచార్య ఎఫెక్ట్‌తో చిరు నెక్స్ట్ సినిమాల్లో మార్పులు??

ఇన్నిరోజులు సినిమా షూటింగ్స్ లో దూకుడు చూపించిన చిరుకి ఆచార్య బ్రేక్ వేసింది. ఆచార్య నెగెటివ్ రిజల్ట్ తర్వాత.............

Chiranjeevi : ఆచార్య ఎఫెక్ట్‌తో చిరు నెక్స్ట్ సినిమాల్లో మార్పులు??

Acharya

Chiranjeevi :  ఇన్నిరోజులు సినిమా షూటింగ్స్ లో దూకుడు చూపించిన చిరుకి ఆచార్య బ్రేక్ వేసింది. ఆచార్య నెగెటివ్ రిజల్ట్ తర్వాత ఫారెన్ టూర్ తో రిలాక్స్ అయ్యారు చిరు. మైండ్ అండ్ బాడీ రీఫ్రెష్మెంట్ అనంతరం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెట్స్ పై ఉన్న సినిమాల విషయంలో కండీషన్స్ అప్లై అంటున్నారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్య మెగాస్టార్ కొత్త సినిమాల కొత్త షెడ్యూల్స్ త్వరలోనే షురూ కానున్నాయి.

కష్టపడి స్టెప్పులేసినా సరే, చిరూ ఇలాంటి సినిమాలు చేస్తే చాలా కష్టం అని తేల్చేసారు మెగాఫ్యాన్స్. సో అభిమానులను, సినీ ప్రేక్షకులను సంతృప్తిపరచాలంటే ట్రెండ్ మార్చాల్సిందే అన్నట్టు రెడీ అవుతున్నారు చిరూ. జూన్ 3 నుంచి టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ కండలవీరుడి కాంబినేషన్ లో ఓ సాంగ్ షూట్ ముంబయ్ లో జరుగనుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీలో గాడ్ ఫాదర్ సాంగ్ షెడ్యూల్ ఈ నెల 10 వరకు జరుగనుంది. ఇక ఇప్పటికే చిరూ, సల్మాన్ లీడ్ కాంబో సీన్స్ ను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సినిమా రష్ చూసిన చిరూ కొన్ని మార్పులు చెప్పినట్టు తెలుస్తోంది. అవి కూడా పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ కానిచ్చేసి ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనేది మెగాస్టార్ ప్లాన్.

గాడ్ ఫాదర్ తర్వాత చిరూ లైన్ లో ఉన్న మూవీ వాల్తేర్ వీరయ్య. జూన్ 10న గాడ్ ఫాదర్ షూటింగ్ అయిన వెంటనే గ్యాప్ అనేది లేకుండా వాల్తేర్ వీరయ్యగా మారబోతున్నారు మెగాస్టార్. జూన్ 11 నుంచి బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా నెక్ట్ షెడ్యూల్ మలేషియాలో జరుగనుంది. దాదాపు 10 రోజులకు పైగా ప్లాన్ చేసిన ఈ షూటింగ్ లో మూవీలోని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మాస్ రాజా రవితేజ కీ రోల్ చేయనున్న వాల్తేర్ వీరయ్యలో సముద్రఖని, బాబీసింహ లీడ్ విలన్స్ గా నటిస్తున్నారు.

Bollywood : అల్లు అర్జున్‌తో అక్షయ్ కుమార్ పాన్ ఇండియా సినిమా..

గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య ప్రాజెక్టుల తర్వాత భోళాశంకర్ పైనే చిరూ కాన్సట్రేట్ చేస్తున్నారు. వేదాళం రీమేక్ గా రానున్న ఈ సినిమాలో మార్పులు ఎక్కువగానే చెప్పినట్టు టాక్. మెహర్ రమేశ్ మరోసారి స్ర్రిప్ట్ వర్క్ చేసి భోళాశంకర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక వెంకీ కుడుమల సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతందన్న దానిపై ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతం సైన్ చేసిన సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేసిన చిరూ కొత్త కథలు వినేందుకు ప్రస్తుతం ఆసక్తి చూపించట్లేదు.