Boss Party Song: బాస్ పార్టీలో డీజే వీరయ్య ఊరమాస్ బీట్స్.. చిరు స్వాగ్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని తొలి సింగిల్ సాంగ్ ‘బాస్ పార్టీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకు చిత్ర యూనిట్ తాజాగా ఈ పాటను రిలీజ్ చేసింది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వాల్తేరు వీరయ్యగా ఊరమాస్ పాత్రలో మెగాస్టార్ కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Boss Party Song: బాస్ పార్టీలో డీజే వీరయ్య ఊరమాస్ బీట్స్.. చిరు స్వాగ్ మామూలుగా లేదుగా!

Chiranjeevi Mesmerizes With His Swag In Boss Party Song

Boss Party Song: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని తొలి సింగిల్ సాంగ్ ‘బాస్ పార్టీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకు చిత్ర యూనిట్ తాజాగా ఈ పాటను రిలీజ్ చేసింది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వాల్తేరు వీరయ్యగా ఊరమాస్ పాత్రలో మెగాస్టార్ కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Waltair Veerayya : బాస్ పార్టీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. వాల్తేరు వీరయ్య!

ఇక ఈ సినిమాలోని ఊరమాస్ పాట ‘బాస్ పార్టీ’ లిరిక్ వీడియోను కొద్దక్షణాల ముందే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌లో మెగాస్టార్ తనదైన స్వాగ్ మూమెంట్స్‌తో అదరగొట్టాడు. మెగాస్టార్ డ్యాన్స్‌లో గ్రేస్ ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండటంతో అభిమానులు ఈ పాటను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కూడా సూపర్‌గా ఉండటంతో ఈ పాట ఫ్యాన్స్‌కు పిచ్చపిచ్చగా ఎక్కేసింది.

Waltair Veerayya : బాస్ పార్టీకి ముహూర్తం షురూ.. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్..

కాగా, ఈ సాంగ్‌లో చిరుతో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా చిందులు వేయడంతో, ఈ జంట వేసిన స్టెప్స్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట వాల్తేరు వీరయ్య సినిమాకే హైలైట్‌గా ఉంటుందని, ఇక ఈ సాంగ్‌లో మెగాస్టార్ స్వాగ్ మూమెంట్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా, సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.