Waltair Veerayya : బాస్ పార్టీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. వాల్తేరు వీరయ్య!

మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఊరమాస్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మాస్ పల్స్ తెలిసిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ 'బాస్ పార్టీ' ప్రోమోని ఇవాళ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించగా..

Waltair Veerayya : బాస్ పార్టీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. వాల్తేరు వీరయ్య!

Waltair Veerayya Boss Party Song Promo

Waltair Veerayya : మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఊరమాస్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్ లో చిరంజీవిని చూసిన అభిమానులకు మళ్ళీ వింటేజ్ చిరుని చూడబోతున్నాము అనే భావన కలిగించింది.

Chiranjeevi : చిరుకు ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

ఇక ఈ సినిమాకు మాస్ పల్స్ తెలిసిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ‘బాస్ పార్టీ’ ప్రోమోని ఇవాళ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించగా.. నాకాష్ అజిజ్, DSP మరియు హరిప్రియ గానం చేశారు. దేవి అందించిన ట్యూన్ అయితే చాలా రెఫ్రెషింగ్ గా ఉంది. కాగా ఫుల్ సాంగ్ ని నవంబర్ 23న సాయంత్రం గం.4:05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జాలర్ల నేపథ్యంలో రాబోతుంది. రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కేథ‌రిన్ థ్రెసా ముఖ్యపాత్రలో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.