Chiranjeevi: మరో ఊరమాస్ రీమేక్‌పై కన్నేసిన మెగాస్టార్.. డైరెక్ట్ చేసేది ఆయనే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడించేస్తుంది. కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ ట్రెమెండస్ రెస్పాన్స్‌తో ఏకంగా రెండు మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ సత్తా ఏమిటో చూపించింది. ఇక ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో చిరంజీవిని చూసి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.

Chiranjeevi: మరో ఊరమాస్ రీమేక్‌పై కన్నేసిన మెగాస్టార్.. డైరెక్ట్ చేసేది ఆయనే..?

Chiranjeevi Planning To Do Another Remake

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడించేస్తుంది. కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ ట్రెమెండస్ రెస్పాన్స్‌తో ఏకంగా రెండు మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ సత్తా ఏమిటో చూపించింది. ఇక ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో చిరంజీవిని చూసి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.

Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..

కాగా ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా సక్సెస్‌తో చిరు అండ్ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అవడంతో మెగాస్టార్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘భోళాశంకర్’ చిత్ర షూటింగ్‌ను స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా ముగించేయాలని ఆయన భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే, చిరు తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఆయన ఆసక్తిని చూపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Chiranjeevi : ప్రాణంతో పోరాడి వచ్చిన పాప.. పూనకాలు లోడింగ్ అంటూ స్టెప్పులు వేస్తుంది.. చిరు రిప్లై!

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఆయన భావిస్తున్నాడట. కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే, ఇక్కడి ఆడియెన్స్ ఈ సినిమాను ఆదరించడం ఖాయమని ఆయన భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌కు అప్పగించాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే చిరు ఈసారి కూడా మరో తమిళ రీమేక్ మూవీతో మనముందుకు వస్తాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.