హీరోలనే పొగుడుతారా? మోడీపై ఆగ్రహం.. బుజ్జగించిన చిరు..

ప్రధాని మోడీ ట్వీట్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..

  • Published By: sekhar ,Published On : April 4, 2020 / 09:44 AM IST
హీరోలనే పొగుడుతారా? మోడీపై ఆగ్రహం.. బుజ్జగించిన చిరు..

ప్రధాని మోడీ ట్వీట్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..

కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో  సి. సి. సి. (క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న‌కోసం) అనే సంస్థ‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ చారిటీ ద్వారా షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌తెలుగు సినీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. సంగీత దర్శకులు కోటి ఆధర్వంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కలిసి కరోనాపై స్పెషల్ సాంగ్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ పాట గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

‘‘చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వరుణ్ తేజ్‌కి, సాయి ధరమ్ తేజ్‌కి.. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్‌పై విజయం సాధిద్దాం’’ అని ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీగారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మీరు విరామం లేకుండా కృషి చేస్తున్నారు. ఇంతటి పెద్ద కార్యక్రమంలో మేం మా వంతుగా చిన్న సహాయం చేశాం. సంగీత దర్శకుడు కోటిగారు.. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Read Also : స్టార్స్ మానవత్వం మర్చిపోయారు- రోజా భర్త సెల్వమణి ఆవేదన

అయితే హీరోలను మాత్రమే పొగుడుతూ పాట కంపోజ్ చేసిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటిని మర్చిపోయారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిరు వారిని చల్లార్చే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను దూరదర్శన్ ట్వీట్ చేస్తూ చిరు, నాగ్, సాయి, వరుణ్‌ల పేర్లను ప్రస్తావించింది. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన ప్రధాని.. వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సంగీతమందించిన కోటి పేరును తన ట్వీట్‌లో ప్రస్తావించలేదు. ఆయన కేవలం డీడీ ట్వీట్‌లో ఉన్నవారి పేర్లనే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తమ తరపునుండి కోటికి థ్యాంక్స్ తెలుపుతూ చిరు ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు..