Comedian Ali: కుమార్తె పెళ్లి మొదటి శుభలేఖను సీఎం జగన్ కు అందించిన కమెడియన్ ఆలీ..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఆలీ పెద్ద కుమార్తె 'ఫాతిమా రెమీజు' మెడిసిన్ చదువుతుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబం మరియు కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా ఎంగేజ్మెంట్ ని అట్టహాసంగా జరిపించాడు ఆలీ. కాగా నేడు అలీ సతీసమేతంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీయం వై.యస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి...

Comedian Ali: కుమార్తె పెళ్లి మొదటి శుభలేఖను సీఎం జగన్ కు అందించిన కమెడియన్ ఆలీ..

Comedian Ali gave the first greeting card to CM Jagan on his daughter's wedding

Comedian Ali: టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఆలీ పెద్ద కుమార్తె ‘ఫాతిమా రెమీజు’ మెడిసిన్ చదువుతుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబం మరియు కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా ఎంగేజ్మెంట్ ని అట్టహాసంగా జరిపించాడు ఆలీ. కాగా సినిమా పరిశ్రమకు చెందిన ఆలీ తన కూతుర్ని కుటుంబం మొత్తం డాక్టర్లతో నిండిన ఒక కుటుంబానికి ఇవ్వనున్నాడట. ఫాతిమా మనవాడే వరుడు కూడా డాక్టరే అని తెలుస్తుంది.

Ali: పవన్ మునుపటి రెండు సినిమాల్లో తన పాత్ర లేకపోవడం గల కారణాలని బయటపెట్టిన ఆలీ..

2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సమయంలో వైయస్సార్ సిపి పార్టీ పగ్గాలు అందుకున్న ఈ స్టార్ కమెడియన్, ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుడిగా నియమితుడయ్యాడు. కాగా నేడు అలీ సతీసమేతంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీయం వై.యస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తమ కుమార్తె వివాహ విషయాన్ని గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా దంపతులు అలీ, భార్య జుబేదా పెళ్లి మొదటి శుభలేఖను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి అందజేశారు. పెళ్లిపత్రిక స్వీకరించిన జగన్, అలీతో తప్పకుండా వివాహానికి వస్తాను అని మాటిచ్చారని తెలుస్తుంది. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆలీకి అత్యంత సన్నిహితుడు. ఇక ఈ వివాహ వేడుకలో ఈ ఇద్దరి రాజకీయ ప్రత్యర్థులు ఎదురుకానున్నారా అనే చర్చ ఇప్పటినుంచి మొదలవుతుంది.