Natural Star : నాని ‘దసరా’ మొదలైంది..

తాజాగా ఇవాళ 'దసరా' సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీరో, హీరోయిన్స్ పై ముహూర్తం షాట్ ని చిత్రీకరించారు. ఈ కార్యక్రమం సింపుల్ గా చిత్ర యూనిట్ తో జరిగింది. నాని.......

Natural Star :  నాని ‘దసరా’ మొదలైంది..

Dasara

Nani :   న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. ఇప్పటికే నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న ‘అంటే.. సుందరానికీ!’ సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేశాడు. తాజాగా నాని నెక్స్ట్ సినిమా ‘దసరా’ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.

గత సంవత్సరం దసరా రోజు నాని ‘దసరా’ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. ఇప్పటికే సినిమా సినిమాకి మాస్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న నాని ఈ సారి మరింత పూర్తి మాస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. శ్రీకాంత్‌ ఓదెల అనే కొత్త దర్శకుడు సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Chiranjeevi : బ్యాక్ టు బ్యాక్ మెగాస్టార్ సినిమాల్లో అనసూయ

తాజాగా ఇవాళ ‘దసరా’ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హీరో, హీరోయిన్స్ పై ముహూర్తం షాట్ ని చిత్రీకరించారు. ఈ కార్యక్రమం సింపుల్ గా చిత్ర యూనిట్ తో జరిగింది. నాని, కీర్తి సురేష్ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దసరా చిత్రం ఈరోజు (బుధవారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇప్పటికే ‘దసరా’ సినిమా కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో దాదాపు 12 ఎకరాల్లో గ్రామీణ నేపథ్యం కనపడేలా భారీ సెట్ ని వేస్తున్నారు. ఈ సెట్ నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. ఇది అవ్వగానే షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం.