Dasara Movie: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న దసరా.. ఏ రోజు అంటే..?

నాని నటించిన ‘దసరా’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

Dasara Movie: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న దసరా.. ఏ రోజు అంటే..?

Dasara Movie Locks OTT Release Date

Dasara Movie: నాచురల్ స్టార్ నాని రీసెంట్ మూవీ ‘దసరా’ ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ చేయగా, రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్ములేపడంతో దసరా మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Dasara Movie: దసరా నుండి ఓఎస్‌టీ రిలీజ్.. పండగ చేసుకోమంటున్న చిత్ర యూనిట్..!

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.110 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ములేపింది. ఇక నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ సినిమా నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దసరా చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని.. అందుకే ఈ సినిమాను ఏప్రిల్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.

Dasara Movie: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న సిల్క్ బార్.. మాస్ కా బాప్ అంటోన్న ఫ్యాన్స్!

దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇక ఓటీటీలో నేరుగా వీక్షించి ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్‌లో కనిపించాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది. థియేటర్లలో దుమ్ములేపిన ఈ దసరా మూవీ ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.