Mega Fans Meet : మీరేమి భయపడక్కర్లేదు.. మెగా ఫ్యాన్స్ మీట్ లో డైరెక్టర్ బాబీ, మెగా బ్రదర్ నాగబాబు..

తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా లో మెగా ఫ్యాన్స్ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో............

Mega Fans Meet : మీరేమి భయపడక్కర్లేదు.. మెగా ఫ్యాన్స్ మీట్ లో డైరెక్టర్ బాబీ, మెగా బ్రదర్ నాగబాబు..

director boby and nagababu in Mega Fans Meet for waltair veerayya promotions

Mega Fans Meet :  ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమా టీంలు సాంగ్స్, గ్లింప్స్ వదులుతూ ప్రమోషన్స్ ని విపరీతంగా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలని ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. అయితే బాలయ్య-చిరంజీవి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ మధ్య పోటీ మాములుగా ఉండదు. ఒకరికి మించి ఒకరు సినిమాని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని ఫీల్ అవుతారు.

ఇటీవల బాలయ్య సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ ని గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ చేసి లాంచ్ చేశారు. అంతకుముందు కూడా టైటిల్ గ్రాండ్ గా కర్నూలు లో రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ లో పోలిస్తే వాల్తేరు వీరయ్య కంటే వీరసింహ రెడ్డి సినిమా ఒక అడుగు ముందే ఉంది. వీరసింహ రెడ్డి ప్రతి దాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ అభిమానులకి జోష్ ఇస్తుంటే వాల్తేరు వీరయ్య నుంచి మాత్రం సింపుల్ గా ఒక అప్డేట్ ఇచ్చి రిలీజ్ చేసేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా లో మెగా ఫ్యాన్స్ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మెగా ఫ్యాన్స్ ఈ సమావేశానికి వచ్చారు. ఈ సమావేశంలో వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ గురించి చర్చించారు. ఈ సమావేశానికి వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, మెగా బ్రదర్ నాగబాబు, సినిమా నిర్మాత రవి వచ్చారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పెను తుపాన్ లో సముద్రంలో సీన్స్ పెట్టాను. చిరంజీవి అంటే ఏమిటో ఈ సినిమా చూపిస్తుంది. నేను మెగాస్టార్ కు పెద్ద ఫ్యాన్, అది కూడా మీకు తెలుసు. బాస్ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మెగాస్టార్ మొన్న నైట్ ఫైనల్ వర్షన్ కంటే ముందే సినిమా చూశారు. టీమ్ మొత్తం చాలా టెన్షన్ లో ఉన్నా సినిమా చూసి మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్నారు. సినిమాకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అని తెలిపాడు.

ఈ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. ఫ్యాన్స్ నిర్మాతలతో గొడవ పడొద్దు, నిర్మాతలకి సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వండి. మెగా ఫ్యాన్స్ కి నేను అండగా ఉంటాను. మీకు ఏం అవసరం వచ్చినా నాకు చెప్పండి. మెగా ఫ్యాన్స్ అంతా కలిసి కట్టుగా ఉండండి, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మీరంతా కష్టపడుతున్నారు, అది మాకు తెలుసు అని అన్నారు. అలాగే థియేటర్స్ ఇష్యూ గురించి కూడా నాగబాబు మాట్లాడి ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా చూస్తామని అన్నారు.

Dhamaka Review : మాస్ హిలేరియస్.. ధమాకా రివ్యూ..

ఇక ఈ సమావేశంలో వాల్తేరు వీరయ్య నిర్మాత రవి మాట్లాడుతూ.. సినిమా ప్రమోషన్స్ ని గ్రాండ్ గానే చేస్తున్నాం. సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. జనవరి 8న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది అని తెలిపారు. ఇలా ప్రమోషన్స్ కోసం మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టి రచ్చ చేయడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది ఈ మెగా మీటింగ్.