Aditi Shankar : ఇలియానా పాటకు డైరెక్టర్ శంకర్ కూతురు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఇలియానా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Aditi Shankar : ఇలియానా పాటకు డైరెక్టర్ శంకర్ కూతురు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్!

Director Shankar daughter Aditi Shankar steps for Ileana song

Aditi Shankar : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆయన కూతురు అదితి శంకర్ కూడా చాలా మందికి తెలిసిన అమ్మాయే. మెడిసిన్ చదివిన ఈ భామ గత ఏడాది స్టార్ హీరో కార్తీ సరసన ‘విరుమన్’ సినిమాలో నటించి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం శివకార్తికేయన్ తో ‘మావీరన్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా ఇలియానా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది.

Game Changer : నేషనల్ అవార్డు విన్నర్ స్టంట్ మాస్టర్‌తో రామ్ చరణ్ పోరాటం.. పిక్ లీక్!

తన తండ్రి శంకర్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన స్నేహితుడు సినిమాలో ‘ఇలియానా చిట్టి బెలియానా’ సాంగ్ అందరికి గుర్తు ఉండే ఉంటది. ఆ సాంగ్ లో ఇలియానా తన జీరో సైజు నడుముతో వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆ పాటకు అదితి శంకర్ అద్భుతంగా డాన్స్ వేసి అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. ఆ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Agent : ఏజెంట్ విషయంలో తప్పంతా మాదే.. చిరంజీవి సినిమాలో అది జరగదు.. నిర్మాత ట్వీట్!

ఇక శంకర్ సినిమాలు విషయానికి వస్తే.. కమల్ హాసన్ తో ఇండియన్ 2 (Indian 2), రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే కమల్ మూవీ షెడ్యూల్ పూర్తి చేసి చరణ్ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1200 మంది ఫైటర్స్ రామ్ చరణ్ పై భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. కాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీల పై ఇంకా క్లారిటీ రాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shankar (@aditishankarofficial)