F3: ట్రైలర్ టాక్.. సమ్మర్ సోగాళ్ళ అల్టిమేట్ ఫన్!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే...

F3: ట్రైలర్ టాక్.. సమ్మర్ సోగాళ్ళ అల్టిమేట్ ఫన్!

F3 Trailer Assures Hilarious Laughter

F3: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను మరింత ఫన్‌తో నింపి ప్రక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు పూర్తి ఫన్ ఇచ్చేందుకు అనిల్ రావిపూడి అండ్ గ్యాంగ్ సిద్ధమయ్యారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

F3: టాలీవుడ్ సీక్వెల్స్ అన్నీ ప్లాపులే.. F3 సెంటిమెంటును అధిగమిస్తుందా?

‘సమ్మర్ సోగాళ్ళు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఎఫ్3 చిత్రాన్ని ఎఫ్2కు మించిన కామెడీతో రెడీ చేసినట్లు ఈ ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు మొదలుకొని, ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు రెడీ అయ్యారు. ఎఫ్2లో భార్యల చుట్టూ తిరిగిన కథను ఈసారి డబ్బు చుట్టూ తిరిగేలా అనిల్ రావిపూడి అదిరిపోయే కంటెంట్ ఇచ్చినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పంచ్ డైలాగుకులకు ఈ సినిమాలో కొదువే లేదని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ఒక్కొక్కరు ఒక్కో మేనరిజంతో మరోసారి ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా చేసేందుకు అందరూ కలిసి ఒకేసారి దండయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు.

F3: మరో సీక్వెల్ రెడీ అంటోన్న అనిల్ రావిపూడి..?

మొత్తానికి ఎఫ్3 చిత్రంతో ఈ సమ్మర్ సోగాళ్ళు థియేటర్లో అదిరిపోయే కామెడీ ట్రీట్ ఇవ్వడం ఖాయమని ఈ ట్రైలర్‌తోనే ప్రూవ్ చేశారు. చూస్తుంటే ఎఫ్3 ఈ సమ్మర్ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని తొలగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌లతో పాటు భారీ క్యాస్టింగ్ ఉంది. ఆద్యంతం నవ్వుల పూవ్వులు పూయించే పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీతో అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని ఈ ట్రైలర్ ప్రూవ్ చేస్తోంది. మరి ఈ కామెడీ ట్రైలర్‌పై మీరూ ఓసారి లుక్కేయండి.