F3: టాలీవుడ్ సీక్వెల్స్ అన్నీ ప్లాపులే.. F3 సెంటిమెంటును అధిగమిస్తుందా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్3’ సినిమా కూడా ఒకటి.

F3: టాలీవుడ్ సీక్వెల్స్ అన్నీ ప్లాపులే.. F3 సెంటిమెంటును అధిగమిస్తుందా?

F3 Movie

F3: ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్3’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ‘ఎఫ్2’కు సీక్వెల్‌గా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఎఫ్2 సినిమాలో ఉన్న నటీనటులు దాదాపు అందరూ ఎఫ్3లో కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి ఫన్‌ను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

F3 Movie: లబ్ డబ్ డబ్బో.. పైసా ఉంటే ప్రపంచమే పిల్లి!

అయితే.. అదే మాదిరి ఈ సినిమా సీక్వెల్ సెంటిమెంటును అధిగమిస్తుందా అన్న ఆసక్తి కూడా కనిపిస్తుంది. నిజానికి ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన సీక్వెల్స్ లో చాలావరకు సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఒకటి రెండు పర్వాలేదనిపించినా దాదాపుగా సినిమాలన్నీ ప్లాపులుగానే మిగిలిపోయాయి. దీంతో ఇప్పుడు రాబోయే ఎఫ్ 3 సీక్వెల్ ఆ గండాన్ని దాటి సెంటిమెంటును బీట్ చేస్తుందా అన్న ఆసక్తి కనిపిస్తుంది.

F3 Movie : హాట్ సమ్మర్‌లో కూల్ ఫన్.. ‘ఎఫ్ 3’ వచ్చేస్తోంది..

90ల్లో వచ్చిన ‘మనీ’కి సీక్వెల్.. ‘మనీ మనీ’, ‘మనీ మనీ మోర్ మనీ’ ప్లాప్. ‘గాయం’ సీక్వెల్ గా వచ్చిన ‘గాయం 2’, ‘శివ’ ప్రాంఛైజీలో తెరకెక్కిన ‘శివ 2’ డిజార్డర్.. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ ప్రాంఛైజీలో వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’.. ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ‘నాగవల్లి’.. ‘వినాయకుడు’ సీక్వెల్ ‘విలోజ్ లో వినాయకుడు’, ‘యమలీల’ సీక్వెల్ ‘యమలీల మళ్ళీ మొదలైంది’ ఫలితం కూడా ప్లాపులే. ‘ఆర్య’ సీక్వెల్ వచ్చిన ‘ఆర్య 2’.. ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2’.. ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఇప్పుడు ఎఫ్ 3 ఈ సెంటిమెంటును బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ కొడుతుందా అన్నది చూడాలి.