Fake Movie Tickets : నకిలీ సినిమా టికెట్ల దందా.. పెద్ద హీరోల సినిమాలొస్తే పండగే..

స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే అభిమానులు సినిమా చూడటానికి ఎంతైనా ఖర్చుపెడతారు. మొదటి రోజు మొదటి ఆట చూడాలని టికెట్ బ్లాక్ లో కొనైనా సరే సినిమా.............

Fake Movie Tickets : నకిలీ సినిమా టికెట్ల దందా.. పెద్ద హీరోల సినిమాలొస్తే పండగే..

Fdfs

Fake Movie Tickets :  స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే అభిమానులు సినిమా చూడటానికి ఎంతైనా ఖర్చుపెడతారు. మొదటి రోజు మొదటి ఆట చూడాలని టికెట్ బ్లాక్ లో కొనైనా సరే సినిమా చూస్తారు. ఇప్పుడు ఇదే కొంతమందికి అవకాశంలా కనిపించి నకిలీ సినిమా టికెట్ల దందా మొదలు పెట్టారు. తాజాగా ఏలూరులో ఈ నకిలీ సినిమా టికెట్ల దందా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల రిలీజ్‌ అయిన ఓ పెద్ద హీరో సినిమాకు ఓ ప్రేక్షకుడు ముందురోజే థియేటర్‌ వద్ద రూ.300 పెట్టి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. ఉదయాన్నే బెనిఫిట్ షో కోసం ఎదురు చూసి ఆ టికెట్ తో ఉదయం ఐదు గంటలకు బెనిఫిట్‌ షోకు వెళ్లాడు. టిక్కెట్‌పై ఉన్న తన సీట్‌ నంబర్‌ చూసుకుని కూర్చున్నాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి తన సీట్‌ నంబర్‌ కూడా అదేనంటూ టిక్కెట్‌ చూపించాడు. థియేటర్‌ సిబ్బందిని పిలిస్తే అతన్ని కూర్చోబెట్టి, ముందు రోజు అధిక రేటుకి టికెట్ కొన్న వ్యక్తిని సీట్ లోంచి లేపేసి బయటకి పంపించారు. ఇదేంటి అని అడిగితే అది నకిలీ టిక్కెట్‌, మాకు సంబంధం లేదని చెప్పారు. దీంతో అభిమాని అయితే ఈ టికెట్స్ ఎలా వచ్చాయి, ఎలా తయారయ్యాయి, నాకు ఎలా అమ్మారు చెప్పాల్సిందే అని థియేటర్‌ యాజమాన్యం, సిబ్బందిని ప్రశ్నించడంతో వాళ్ళు అతనిని బయటకి పంపించేశారు. దీంతో ఆ ప్రేక్షకుడు ఏలూరు వన్‌టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Dasari Narayanarao : దాసరిని మర్చిపోయారు.. సినీ కార్మికోత్సవంపై సి.కళ్యాణ్ అసంతృప్తి

ఇలాంటి సంఘటనలు ఇటీవల రిపీట్ గా జరిగాయి. అయితే సినిమా థియేటర్‌లోని సిబ్బందే నకిలీ టిక్కెట్లను తయారు చేస్తున్నారు అని సమాచారం. ఇలా ఎవరైనా బ్లాక్ లో లేదా ముందే టికెట్ కొంటే లోపలికి వెళ్ళాక బయటకి పంపించేస్తున్నారు. దీంతో టికెట్స్ కొన్నవారు అటు సినిమా చూడక, ఇటు డబ్బులు పోయి చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ విధంగా రోజులో ఒక్క షోకి దాదాపు 10 టికెట్స్ ని అమ్ముతున్నారు. ఒక్క టికెట్ ధర 300 ఉన్నా ఒక్క షోకే 3000 జేబులో వేసుకుంటున్నారు. అంటే రోజుకి నాలుగు షోలకి దాదాపు 12 వేల వరకు సామాన్య ప్రజల నుంచి దోచుకుంటున్నారు. ఇలా రెగ్యులర్ గా జరుగుతుండటంతో దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులని కోరారు ప్రేక్షకులు.