Mahesh Babu: ఆ సంగతి మర్చిపోయిన మహేష్.. గుర్తుచేస్తున్న ఫ్యాన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే....

Mahesh Babu: ఆ సంగతి మర్చిపోయిన మహేష్.. గుర్తుచేస్తున్న ఫ్యాన్స్!

Fans Remembering Mahesh Babu About Murari Baava Song In Svp

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు. చాలా రోజుల తరువాత మహేష్ నుండి ఈ స్థాయిలో మాస్ పర్ఫార్మెన్స్ రావడంతో వారు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరిచారు.

Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?

ఇక ఈ సినిమాకు తొలిరోజు నుండే మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. ఇప్పటికే 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా మహేష్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందర మహేష్ అండ్ టీమ్ ఈ సినిమాలోని మాస్ సాంగ్ గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు. ఈ సినిమాలో తొలుత ‘మురారి బావ’ అనే మాస్ సాంగ్‌ను అనుకున్నా, తరువాత ‘‘మ..మ..మహేశ’’ అనే పాటను ఫైనల్ చేసినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!

అయితే సినిమా రిలీజ్ అయ్యాక ‘మురారి బావ’ పాటను ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని మహేష్ అప్పుడు తెలిపాడు. కానీ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటినా, ఇప్పటివరకు ‘మురారి బావ’ పాటకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో అభిమానులు నిరాశకు లోనై, మహేష్ బాబు ఈ పాట గురించి మర్చిపోయినట్లు ఉన్నాడని అనుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో ‘మురారి బావ’ గురించి చిత్ర యూనిట్‌కు గుర్తుకు చేస్తూ రచ్చ చేస్తున్నారు. మరి ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్, ఈ ‘మురారి బావ’ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది ప్రస్తుతం మరోసారి ఆసక్తికరంగా మారింది.