Film Chamber : మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ సమావేశం.. పాప్ కార్న్ రేట్లు తగ్గుతాయా?

తాజాగా మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ సమావేశం ముగిసింది. ఫిల్మ్ చాంబర్ లో సమావేశానికి అన్ని మల్టీఫ్లెక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో........

Film Chamber : మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ సమావేశం.. పాప్ కార్న్ రేట్లు తగ్గుతాయా?

Film Chamber meeting with Multiplex Theaters

Film Chamber : టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం వరుస సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమస్యలకి పరిష్కారం దొరికేదాకా షూటింగ్స్ నిలిపివేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ .. ఇలా పలు సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. టాలీవుడ్ సమస్యలకి, జనాలని థియేటర్లకు రప్పించడానికి పరిష్కారాలు వెతుకుతున్నాయి. జనాలు థియేటర్లకు రాకపోవడానికి ముఖ్య కారణాల్లో టికెట్ రేట్లతో పాటు, మల్టీప్లెక్స్ లలో స్నాక్స్ రేట్లు కూడా ఎక్కువగా ఉండటం. మల్టీప్లెక్స్ లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు ఎంత ఎక్కువగా ఉంటాయో తెలిసిందే. అందుకే ఈ సమస్యని కూడా పరిష్కరించడానికి మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ సమావేశం ఏర్పాటు చేసింది.

Rambha-Kushboo : చాలా రోజుల తర్వాత కలిసిన అలనాటి తారలు.. వైరల్ అవుతున్న ఫొటోలు..

తాజాగా మల్టీఫ్లెక్స్ థియేటర్ల ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ సమావేశం ముగిసింది. ఫిల్మ్ చాంబర్ లో సమావేశానికి అన్ని మల్టీఫ్లెక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టికెట్ ధరలు, తినుబండరాలు, వసతులపై మల్టీఫ్లెక్స్ ప్రతినిధులతో ఫిల్మ్ చాంబర్ చర్చలు జరిపింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మల్టీఫ్లెక్స్ లలో తినుబండారాల ధరలు తగ్గించాలని, ధరలు తగ్గించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలని మల్టీఫ్లెక్స్ ప్రతినిధులను కోరింది ఫిల్మ్ చాంబర్. చర్చల అనంతరం ఫిల్మ్ చాంబర్ సూచనలను పరిగణలోకి తీసుకొని తినుబండారాల ధరలు తగ్గిస్తామని, నిర్మాతలు నిర్ణయించిన టికెట్ ధరలనే మల్టీఫ్లెక్స్ లో అమలు చేస్తామని మల్టీఫ్లెక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే మల్టీప్లెక్స్ లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ రేట్లు తగ్గుతాయో లేదో చూడాలి.