‘రాధే’ : సల్మాన్ ఖాన్ ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’..

‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో ‘రాధే’.. (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్) సినిమా రూపొందనుంది.. 2020 ఈద్ కానుకగా రిలీజ్ చెయ్యనున్నారు..

  • Published By: sekhar ,Published On : October 19, 2019 / 08:28 AM IST
‘రాధే’ : సల్మాన్ ఖాన్ ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’..

‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో ‘రాధే’.. (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్) సినిమా రూపొందనుంది.. 2020 ఈద్ కానుకగా రిలీజ్ చెయ్యనున్నారు..

సల్మాన్ ఖాన్ ‘చుల్‌బుల్ పాండే’ గా ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు. ‘దబాంగ్’, ‘దబాంగ్ 2’ సినిమాల తర్వాత.. ప్రభుదేవా దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా నటిస్తున్న మూవీ ‘దబాంగ్ 3’.. సల్మాన్ ఖాన్ ఫిలింస్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్, సఫ్రోన్ బ్రోడ్‌కాస్ట్ & మీడియా లిమిటెడ్ బ్యానర్స్‌పై.. సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తన తర్వాతి సినిమాను కూడా ఫిక్స్ చేసేశాడు సల్మాన్..

ప్రభుదేవా దర్శకత్వంలోనే మరో సినిమా చెయ్యబోతున్నాడు. ‘రాధే’.. (యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సల్మాన్ గన్ ఫైర్ చేస్తున్న లుక్ కిరాక్ ఉంది. హిందీలో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌కు ప్రభుదేవా ‘వాంటెడ్’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చాడు. (తెలుగు ‘పోకిరి’ రీమేక్).. ఈ మూవీ తర్వాత సల్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు 10 ఏళ్ళ తర్వాత సల్మాన్ మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టిందీ కాంబినేషన్..

Read Also : ‘పాగల్ పంతీ’ క్యారెక్టర్ పోస్టర్స్ చూశారా!

ప్రభుదేవా చెప్పిన స్టోరీ అండ్ అతని వర్కింగ్ స్టైల్ నచ్చి సల్లూ భాయ్ ‘రాధే’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.. సల్మాన్ ఖాన్ ఫిలింస్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు  నిర్మిస్తున్న ‘రాధే’ 2020 ఈద్ కానుకగా విడుదల చెయ్యనున్నారు. ‘దబాంగ్ 3’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజవుతోంది.