Gangotri Kavya: వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందో చూశారా?

ఎప్పటిలాగానే ఇండస్ట్రీకి హీరోలు రావడం.. సినిమాలు రావడం సాధారణ విషయమే. కానీ కొన్ని సినిమాలు ఎన్నేళ్లైనా కూడా అలా గుర్తుండిపోతాయి. అలా గుర్తుండే సినిమాలలో గంగోత్రి సినిమా కూడా ఒకటి.

Gangotri Kavya: వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందో చూశారా?

Gangotri Kavya

Gangotri Kavya: ఎప్పటిలాగానే ఇండస్ట్రీకి హీరోలు రావడం.. సినిమాలు రావడం సాధారణ విషయమే. కానీ కొన్ని సినిమాలు ఎన్నేళ్లైనా కూడా అలా గుర్తుండిపోతాయి. అలా గుర్తుండే సినిమాలలో గంగోత్రి సినిమా కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి సినిమా ఇది కాగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100వ సినిమా కూడా ఇదే. కీరవాణి పాటలు.. అదితి అగర్వాల్ గ్లామర్ ఇలా.. ఈ సినిమా భారీ సక్సెస్ కొట్టింది. ఈ సినిమా పాటలలో వల్లంకి పిట్ట పాట ఇప్పటికీ అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది.

Bigg Boss 5: వచ్చేవారం ఇంట్లో కొత్త కంటెస్టెంట్లు.. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ ఏంటి?!

అల్లు అర్జున్ చిన్నప్పుడు పాడే వల్లంకి పిట్ట పాటలో చిన్నారి కావ్య క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందర్నీ మాయ చేసింది. గంగోత్రి సమయంలో ఈమె వయసు 4 ఏళ్లు కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా గంగోత్రి సినిమా వచ్చి 18 ఏళ్ళు గడిచిపోయింది. అంటే అప్పటి చిన్నారి కావ్యకి ఇప్పుడు 22 ఏళ్ళు. మరి ఇప్పుడు కావ్య ఎలా ఉందో చూస్తున్నారు కదా. కావ్య గంగోత్రి సినిమా తర్వాత సినిమాలకు దూరమవగా చదువు పూర్తి చేసి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీకి సిద్ధమైంది.

Gangotri Kavya

Gangotri Kavya

Chiru 154: చిరుతో పవన్ మల్టీస్టారర్.. అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు!

తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన కావ్య ఇప్పుడు వరసగా ఆడిషన్స్ ఇస్తూ తన లక్ పరీక్షించుకుంటుంది. కావ్య సినీ అవకాశాల కోసం ఇచ్చిన ఫోటో షూట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బన్నీ అభిమానులు గంగోత్రి సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండగా.. కావ్యలో హీరోయిన్ లక్షణాలున్నాయని మంచి బొమ్మ పడితే మరో తెలుగు హీరోయిన్ స్టార్ హీరోయిన్ కావడం గ్యారంటీ అంటున్నారు. మరి వల్లంకి పిట్ట జాతకం ఎలా ఉందో చూడాలి.