Global Prabhas Day : హ్యాపీ బర్త్‌డే డార్లింగ్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. సినిమా అప్‌డేట్లతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చెయ్యనున్నారు మేకర్స్..

10TV Telugu News

Global Prabhas Day: ప్రభాస్.. డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్, రెబల్ స్టార్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అండ్ గ్లోబల్ స్టార్.. అక్టోబర్ 23 ప్రభాస్ తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కేవలం 17 సినిమాలకే టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే అసలు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ నటుడుకి సాధ్యం కాని రేర్ ఫీట్ సాధించారు.

Global Prabhas

 

దర్శకదీరుడు రాజమౌళి ‘బాహుబలి – ది బిగినింగ్, బాహుబలి – ది కన్‌క్లూజన్’ సినిమాలతో ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి మాత్రమే జపాన్ దేశంలో అభిమానులున్నారు. ‘బాహుబలి’ నుండి మన డార్లింగ్‌కి అక్కడ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కేవలం ప్రభాస్‌ని కలవడానికే అక్కడినుండి హైదరాబాద్ వచ్చారంటే రెబల్ స్టార్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Prabhas Family : ఫ్యామిలీ పెద్దదే డార్లింగ్..!

ఆఫ్టర్ ‘బాహుబలి’, ‘సాహో’ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో తెలిసిందే. మన సినిమాలంటే చిన్న చూపు కలిగిన బాలీవుడ్ సైతం ప్రభాస్ మానియా చూసి షాక్ అయ్యింది. రాజమౌళి – ప్రభాస్ కలిసి తెలుగు సినిమా సత్తా ఇదీ అని ప్రపంచానికి చాటి చెప్పారు.

Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..

ఇప్పుడు డార్లింగ్ చేస్తున్నవన్నీ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాలే. ‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, ఓం రౌత్ హిస్టారికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ తో బాలీవుడ్ ఎంట్రీ, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్-K’ తో పాన్ వరల్డ్ మూవీ, కెరీర్‌లో మైల్ స్టోన్ అయిన 25వ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చెయ్యడం.. ఇలా సినిమా సినిమాకి హీరో తన రేంజ్‌ని మాత్రమే కాదు.. తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నారు ప్రభాస్.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

‘ఈశ్వర్’, ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవి రాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’, ‘బిల్లా’, ‘ఏక్ నిరంజన్’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రెబల్’, ‘మిర్చి’, ‘బాహుబలి – ది బిగినింగ్’, ‘బాహుబలి – ది కన్‌క్లూజన్’, ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-K’,‘స్పిరిట్’.. ఇలా పాతిక సినిమాలు కూడా కంప్లీట్ కాకముందే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అండ్ గ్లోబల్ స్టార్‌గా ఎదగడం అంటే చిన్న విషయం కాదు.. ముందు ముందు రెబల్ స్టార్ రేంజ్ మరోలా ఉంటుందనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు.. హ్యాపీ బర్త్‌డే డార్లింగ్..

Prabhas : సింహం.. తిమింగలం.. ప్రభాస్ ఫ్యాన్స్ బ్యానర్స్ అదుర్స్..