Hari Hara Veera Mallu: వీరమల్లు నెక్ట్స్ షెడ్యూల్ ఆ రోజునే స్టార్ట్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పీరియాడికల్ ఫిక్షన్ కథగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసిన వీరమల్లు టీమ్, ఇప్పుడు తన నెక్ట్స్ షెడ్యూల్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.

Hari Hara Veera Mallu Next Schedule To be Start On This Date
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పీరియాడికల్ ఫిక్షన్ కథగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసిన వీరమల్లు టీమ్, ఇప్పుడు తన నెక్ట్స్ షెడ్యూల్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.
Hari Hara Veera Mallu : పవన్ సినిమాలో మొఘల్ రాణిగా బాలీవుడ్ బ్యూటీ..
ఈ క్రమంలో జనవరి 17 నుండి ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాలని పవన్ అండ్ టీమ్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ షెడ్యూల్ కోసం సారథి స్టూడియోస్‌లో ఓ సెట్ కూడా వేశారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ఇక్కడ స్టార్ట్ చేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో పవన్ సరికొత్త అవతారం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను ఓ రేంజ్లో క్రియేట్ చేయగా, ఈ సినిమాలో ఆయన పాత్ర రాబిన్‌హుడ్ తరహాలో ఉండబోతుందని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ సినిమాలో ఓ మొఘల్ రాకుమారి పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.