Panchathantram: పంచతంత్రం కోసం వస్తున్న ‘పవర్’ఫుల్ డైరెక్టర్!

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ యాంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కామెడీ బ్రహ్మ డా.బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Panchathantram: పంచతంత్రం కోసం వస్తున్న ‘పవర్’ఫుల్ డైరెక్టర్!

Panchathantram: టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ యాంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కామెడీ బ్రహ్మ డా.బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను పెంచేశాయి.

Panchathantram Trailer: సాలిడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

కాగా, తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 7న నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చేందుకు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఓ ‘పవర్’ఫుల్ డైరెక్టర్‌ను ముఖ్య అతిథిగా తీసుకొస్తుంది చిత్ర యూనిట్. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. డిసెంబర్ 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాలో 5 జంటలకు సంబంధించిన కథలు మనకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చిత్ర యూనిట్ ప్రెజెంట్ చేయనుంది. ఈ సినిమాలో సముథ్రఖని, శివాత్మిక రాజశేఖర్, స్వాతి రెడ్డి, నరేశ్ అగస్త్య, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.