టామ్ క్రూజ్ హీరోగా స్పేస్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఫస్ట్ ఫిల్మ్

హాలీవుడ్ సినిమా స్పేస్‌లో షూటింగ్ జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి..

టామ్ క్రూజ్ హీరోగా స్పేస్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఫస్ట్ ఫిల్మ్

హాలీవుడ్ సినిమా స్పేస్‌లో షూటింగ్ జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి..

సినిమా షూటింగులకు ప్రపంచంలోని అందమైన లొకేషన్లు, కళ్లుచెదిరే సెట్స్ సరిపోవు స్పేస్ కూడా కావాలంటున్నాడు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్. లాక్‌డౌన్ కారణంగా మిషన్ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో తెరకెక్కుతున్న 7వ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు తన కొత్త సినిమాతో స‌రికొత్త రికార్డ్ సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు క్రూజ్. ఇందుకోసం టామ్ క్రూజ్… ఎలోన్ మస్క్ సంస్థ చేతులు కలిపాయి. తాజా స‌మాచారం ప్రకారం నాసా సహకారంతో ఈ అద్భుతం జ‌ర‌గ‌నుంది. హాలీవుడ్ చరిత్రలో ఇదో కొత్త ట్రెండ్ అని చెబుతున్నారు.

టామ్ క్రూజ్  న‌టించబోయే ఈ మూవీ అంతరిక్షంలో జరిగే అద్భుతమైన యాక్షన్ చిత్రంగా రూపొంద‌నుందని, అయితే ఇది మిషన్ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో పార్ట్ కాదని, పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామని నిర్మాత‌లు స్ప‌ష్టం చేశారు. నాసా అనుమతిస్తే స్పేస్‌లో షూటింగ్ జరుపుకునే ఫస్ట్ మూవీలో నటించిన రికార్డ్ టామ్ క్రూజ్‌దే అవుతుందని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Also Read | చక్రి కుటుంబానికి అనూహ్యా రెడ్డి ఆర్థిక సాయం