Pushpa Trailer: పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే.. షేక్ చేస్తున్న ట్రైలర్..!

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ట్రైలర్ రిలీజైంది. 2 నిముషాల 31 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్.. నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఫ్యాన్స్ ను షేక్ చేస్తోంది. సినిమా.. ఈ నెల 17 రిలీజ్ కానుంది.

10TV Telugu News

Pushpa Trailer: “భూమండలంలో ఏడా పెరగని సెట్టు.. మన శేషాచలం అడవుల్లో పెరుగుతుండాది.. ఈడనుంచే వేలకోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతాండాది.. గోల్డ్ రా ఇదీ.. భూమిపై పెరిగే బంగారం.. పేరు ఎర్రచందనం!” ఇదీ సింపుల్ గా.. పుష్ప సినిమా లేటెస్ట్ ట్రైలర్ ఇంట్రో. చదువుతుంటేనే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో.. ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో అనిపిస్తోంది కదా. యస్. రెండున్నర నిముషాల ట్రైలర్ లో.. ప్రతీ ఫ్రేమ్ నూ.. ఇలాగే ఇంట్రెస్టింగ్ గా.. ఎగ్జైట్ మెంట్ కలిగేలా ప్లాన్ చేశాడు.. డైరెక్టర్ సుకుమార్.

కాసేపటి క్రితమే పుష్ప ట్రైలర్ రిలీజైంది. వస్తూ వస్తూనే.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గూస్ బంప్స్ కలిగించే దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో.. ట్రైలర్ అదుర్స్ అనిపిస్తోంది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను మరో మెట్టు ఎక్కించేలా.. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి.. హై రిచ్ క్వాలిటీతో ట్రైలర్ ను ప్లాన్ చేశాడు సుక్కూ. స్పెషల్ గా చెప్పాలంటే.. అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ను 2 షేడ్స్ లో చూపించాడు. ఎర్ర చందనం స్మగ్లర్ గా ఓ షేడ్.. ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి బాస్ గా మరో షేడ్.. విజిల్స్ వేయించేలా ఉన్నాయి.

పల్లెటూరి పిల్లగా హీరోయిన్ రష్మిక నాచురల్ బ్యూటీ.. ఆమెతో ప్రేమికుడిగా బన్నీ సరసం.. విలన్ గా సునీల్ బీభత్సం.. అన్నీ ఫుల్ ప్యాక్డ్ గా పర్ఫెక్ట్ మెజర్ మెంట్స్ తో ట్రైలర్ రిలీజ్ చేశాడు సుక్కూ. ఇప్పటికే రిలీజైన 3 పాటలు సెన్సేషనల్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ కోవలో వచ్చిన ట్రైలర్.. ఫ్యాన్స్ నే కాదు.. సినిమా ప్రేక్షకులందరినీ థ్రిల్ కు గురి చేస్తోంది.

ఈ నెల 17న సినిమా థియేటర్లలోకి రానుంది. అంతకుముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అఖండ విజయంతో జోష్ లో ఉన్న నట సింహం బాలయ్య.. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యే అవకాశాలున్నాయి. అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరు కాగా.. ఇప్పుడు బాలయ్య పుష్ప ప్రీ రిలీజ్ కు వెళ్తారన్న ఊహాగానాలు.. నందమూరి, అల్లువారి అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ట్రైలర్ రాకతో.. అల్లువారి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి.

ఇక.. తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ట్రైలర్ విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై.. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. విలన్ గా ఫాహద్ ఫాసిల్ నటిస్తున్నాడు.

Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

Pushpa: బన్నీ మేనియా.. కేరళలో స్పెషల్ షోస్ బుకింగ్ స్టార్ట్!

Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ

×