Indian 2: ఇండియన్-2 నుంచి కొత్త అప్డేట్.. నెక్ట్స్ షెడ్యూల్‌కు డేట్ ఫిక్స్..?

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్-2’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ఈ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు చిత్ర యూనిట్.

Indian 2: ఇండియన్-2 నుంచి కొత్త అప్డేట్.. నెక్ట్స్ షెడ్యూల్‌కు డేట్ ఫిక్స్..?

Indian 2 Movie New Update On Next Schedule Shooting

Indian 2: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్-2’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే ఈ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు చిత్ర యూనిట్.

Indian 2: ఇండియన్-2 సినిమాలో స్టార్ క్రికెటర్ తండ్రి!

కాగా, ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేసేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. ఇండియన్-2 చిత్ర నెక్ట్స్ షెడ్యూల్‌ను జనవరి 22 నుండి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఈ షెడ్యూల్ కొంచెం లెంగ్తీగా సాగనుందని.. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ షూటింగ్‌ను తిరుపతి, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించేందుకు శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

Indian 2: త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!

ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవానీ శంకర్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.