ఇస్మార్ట్ శంకర్‌కి మణిశర్మ సంగీతం

ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మణిశర్మ సంగీతం, రాజ్ తోట కెమెరా

  • Published By: sekhar ,Published On : January 7, 2019 / 01:20 PM IST
ఇస్మార్ట్ శంకర్‌కి మణిశర్మ సంగీతం

ఇస్మార్ట్ శంకర్ సినిమాకి మణిశర్మ సంగీతం, రాజ్ తోట కెమెరా

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో, పూరీ భార్య లావణ్య సమర్పణలో, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై, చార్మీతో కలిసి, ఓన్ డైరెక్షన్‌లో పూరి, నిర్మిస్తున్న సినిమా, ఇస్మార్ట్ శంకర్. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ మోషన్  పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇస్మార్ట్ శంకర్, పక్కా హైదరాబాదీ స్టైల్‌లో, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందట. 

ఈ మూవీ టీమ్ నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీత మందించనున్నాడు. పూరి, మణిల కాంబోలో వచ్చిన పోకిరి ఆడియో ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. టెంపర్ సినిమాకి ఆర్ఆర్ ఇచ్చింది మణిశర్మనే. అలాగే అర్జున్ రెడ్డికి పని చేసిన రాజ్ తోట, ఇస్మార్ట్ శంకర్‌కి కెమెరామెన్‌గా ఫిక్స్ అయ్యాడు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, మే నెలలో మూవీని రిలీజ్ చెయ్యబోతున్నారు. 

వాచ్ టైటిల్ మోషన్  పోస్టర్‌…