కబడ్డీ కోచ్ ‘జ్వాలా రెడ్డి’గా మిల్కీబ్యూటీ

మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా తెలంగాణా కబడ్డీ టీమ్ కోచ్‌ ‘జ్వాలా రెడ్డి’ క్యారెక్టర్‌లో కనిపించనుంది..

  • Published By: sekhar ,Published On : February 8, 2020 / 04:50 AM IST
కబడ్డీ కోచ్ ‘జ్వాలా రెడ్డి’గా మిల్కీబ్యూటీ

మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్’ మూవీలో మిల్కీబ్యూటీ తమన్నా తెలంగాణా కబడ్డీ టీమ్ కోచ్‌ ‘జ్వాలా రెడ్డి’ క్యారెక్టర్‌లో కనిపించనుంది..

మ్యాచో స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా.. ‘‘సీటీమార్’’.. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో.. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా గోపిచంద్ 28వ సినిమా ఇది. మ్యాచో స్టార్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా జతకడుతుండగా.. దిగంగన సూర్యవంశీ మరో కథానాయికగా నటిస్తోంది.

భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపిచంద్, తెలంగాణా కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా కనిపించనున్నారని సమాచారం.శనివారం ఉదయం ‘‘సీటీమార్’’ నుండి తమన్నా లుక్ రిలీజ్ చేశారు. మిల్కీబ్యూటీ ఈ సినిమాలో తమన్నా ‘జ్వాలా రెడ్డి’ క్యారెక్టర్‌లో కనిపించనుంది.

Read Also : ప్రభు, క్రిష్ ఇద్దరిలో వెంకటలక్ష్మికి ఎవరంటే ఇష్టం?

 

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ : “ఇటీవల హైదరాబాద్, రాజమండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఆర్.ఎఫ్.సిలో కొత్త షెడ్యూల్ జరుపుతున్నాం. సమ్మర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. హై టెక్నికల్ వాల్యూస్‌తో ప్రెస్టీజియస్ మూవీగా రూపొందిస్తున్నాం. ‘‘సీటిమార్’’ గోపిచంద్‌కి భారీ కమర్షియల్ మూవీ అవుతుంది’’ అన్నారు.

తరుణ్ అరోరా, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి : సౌందర్రాజన్, సంగీతం : మణిశర్మ, ఎడిటర్ : తమ్మిరాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, సమర్పణ : పవన్ కుమార్, నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం : సంపత్ నంది.

GOPICHAND