Bandla Ganesh : బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ ఇచ్చాడా?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకొని టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రొడ్యూస్ చేసే రేంజ్ కి ఎదిగిన నటుడు 'బండ్ల గణేష్'. ఇక తనకి లైఫ్ ఇచ్చిన పవన్ పై సినీ, రాజకీయం పరంగా ఎవరన్నా విమర్శలు చేస్తే వాటికి కౌంటర్లు ఇస్తూ పవన్ ని సపోర్ట్ చేస్తూ వస్తుంటాడు. కానీ ఈసారి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పవన్‌కే కౌంటర్ ఇచ్చేలా ఉంది.

Bandla Ganesh : బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ ఇచ్చాడా?

Bandla Ganesh pawan kalyan

Bandla Ganesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకొని టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రొడ్యూస్ చేసే రేంజ్ కి ఎదిగిన నటుడు ‘బండ్ల గణేష్’. పవన్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సినిమా హిట్ తరువాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్లతో కూడా సినిమాలు నిర్మించే ఛాన్స్ కొట్టేశాడు. ఇక తనకి లైఫ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ దేవుడిలా భావిస్తాడు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ పై సినీ, రాజకీయం పరంగా ఎవరన్నా విమర్శలు చేస్తే వాటికి కౌంటర్లు ఇస్తూ పవన్ ని సపోర్ట్ చేస్తూ వస్తుంటాడు.

Pawan Kalyan : అడిగినంత ఇవ్వరు.. సినిమా రెమ్యునరేషన్స్ గురించి బయటపెట్టిన పవర్ స్టార్..

కానీ ఈసారి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పవన్‌కే కౌంటర్ ఇచ్చేలా ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో పవన్ రెమ్యునరేషన్ గురించి అడుగుతూ బాలకృష్ణ.. గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చాడు అని ప్రశ్నించాడు. దానికి పవన్ బదులిస్తూ.. ‘నేను అనుకున్నంత కాకపోయినా తను అనుకున్నది ఇచ్చాడు’ అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను కొంతంది వివాదం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజెన్.. ‘బండ్ల గణేష్ అన్నా, ఇప్పుడు అర్థం అయిందా. గౌరవం ఇచ్చే వాళ్ళకే మనం కూడా గౌరవం ఇవ్వాలి. నువ్వు పవన్ కళ్యాణ్ ని ఎంత అభిమానించావో తెలుగు వారందరికీ తెలుసు. కానీ ఒక పాపులర్ షో అని కూడా చూడకుండా అలా మాట్లాడాడు అంటే, ఆయన నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో తెలుస్తుంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి రియాక్ట్ అవుతూ బండ్ల గణేష్.. ‘నా విశ్వరూపం కూడా చూపిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు. పవన్ ని దేవుడిలా భావించే బండ్ల గణేష్ ఈ ట్వీట్ ని ఏ ఉద్దేశంతో వేశాడో తెలియక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.