Sharwanand : త్రివిక్రమ్ శిష్యుడు దర్శకత్వంలో శర్వానంద్ సినిమా ఆగిపోయిందా?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. దాదాపు అరడజను సినిమాలు తరువాత 'ఒకే ఒక జీవితం' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కాగా ఈ సినిమా టైం లోనే శర్వానంద్.. త్రివిక్రమ్ శిష్యుడు కృష్ణ చైతన్యతో ఒక సినిమాకి సైన్ చేశాడు. ఈ మూవీ ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఆగిపోయింది అంటూ ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Sharwanand : త్రివిక్రమ్ శిష్యుడు దర్శకత్వంలో శర్వానంద్ సినిమా ఆగిపోయిందా?

Sharwanand

Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. దాదాపు అరడజను సినిమాలు తరువాత ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. టైం ట్రావెల్ కి అమ్మ సెంటిమెంట్ ని జత చేసి తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. కాగా ఈ సినిమా టైం లోనే శర్వానంద్.. త్రివిక్రమ్ శిష్యుడు కృష్ణ చైతన్యతో ఒక సినిమాకి సైన్ చేశాడు. ఈ మూవీ ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఆగిపోయింది అంటూ ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు శర్వానంద్ ఈ మూవీ డేట్స్ ని మరో దర్శకుడికి కూడా ఇచ్చేసినట్లు సమాచారం.

Sharwanand : సాయి పల్లవితో గుడికి వెళదామంటే చాలు వచ్చేస్తుంది.. ఇద్దరం కలిసి చాలా గుళ్ళకి వెళ్ళాం..

కృష్ణ చైతన్య, నితిన్ తో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఆ మూవీ పెద్దగా హిట్ కాలేదు. రెండో సినిమాగా శర్వానంద్ తో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా కృష్ణ చైతన్య చెప్పిన కథ విషయంలో శర్వానంద్ కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో, రిస్క్ తీసుకొనే ధైర్యం లేక ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశాడని తెలుస్తుంది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో చేయాల్సి ఉంది శర్వానంద్. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో దర్శకుడితో శర్వానంద్ తన కొత్త ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకు వెళ్ళబోతున్నాడట.

దేవదాస్, హీరో సినిమాలు తెరకెక్కించిన ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమాకి ఓకే చెప్పాడని సమాచారం. శ్రీరామ్ ఆదిత్యకి చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా, అతను చెప్పిన కథ శర్వానంద్ కి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పాడట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది తెలియాలి అంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం ఈ హీరో ఏడడుగులు వేసేందుకు సిద్దమవుతున్నాడు. ఇటీవలే గ్రాండ్ గా తన ఎంగేజ్మెంట్ ని జరుపుకున్నాడు.