Adipurush : ఆదిపురుష్ నుంచి జై శ్రీ రామ్ సాంగ్ రిలీజ్.. వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ..

ఆదిపురుష్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టిన జైశ్రీరామ్ తోనే ఆ పని స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో వచ్చి అందర్నీ మెప్పించింది. తాజాగా నేడు ఈ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Adipurush : ఆదిపురుష్ నుంచి జై శ్రీ రామ్ సాంగ్ రిలీజ్.. వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ..

Jai Shri Ram Lyrical song From Adipurush Movie Released

Jai Shri Ram : ఆదిపురుష్.. ఈమధ్య కాలంలో ఇండియా వైడ్ గా జనాలు సూపర్ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్న సినిమా. ప్రభాస్ తన రొటీన్ లుక్ ని, ఇమేజ్ ని పక్కనపెట్టి రాముడిగా కనిపిస్తున్న ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓమ్ రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రామాయణం బ్యాక్ డ్రాప్ మూవీ ఆదిపురుష్ కి సంబందించి ఎన్ని టీజర్లు, వీడియోలు వచ్చినా.. సినిమా మొత్తం మీద ఆడియన్స్ ని ఆకట్టుకున్నది ఒక్కటంటే ఒక్కటి. అదే జై శ్రీరామ్ పాట. జస్ట్ బిట్ సాంగ్ తోనే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఈ పాటకి. అలాంటి క్రేజ్ ఉన్న జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ నేడు రిలీజ్ అయింది.

టీజర్ తో వచ్చిన నెగెటివిటీతో కాస్త డల్ అయిన ఆదిపురుష్ యూనిట్ కి ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్ బిట్ హిట్ అవ్వడం మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ టీజర్ మీద నుంచి వచ్చిన నెగెటివిటీ కాస్త ఈ సాంగ్ తో కొట్టుకుపోయిందనే చెప్పాలి. ఈ సాంగ్ తో పాటు ట్రైలర్ కూడా సినిమా మీదున్న ట్రోలింగ్ ని తగ్గించింది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా 600కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ జూన్ 16నే రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ఇప్పటి నుంచి ప్రమోషన్లు చెయ్యడమే పనిగా పెట్టుకుంది టీమ్.

Adipurush : ఆదిపురుష్ రన్ టైం ఎంతో తెలుసా.. జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్!

ఆదిపురుష్ మీద ఇప్పటి నుంచైనా గట్టి ప్రమోషన్లు స్టార్ట్ చెయ్యకపోయినా, ఆడియన్స్ లో సినిమా మీద నమ్మకం కలిగించకపోయినా ఆదిపురుష్ కి గట్టిదెబ్బ తగిలే చాన్సుంది. అందుకే ఇప్పటినుంచైనా ఫాన్స్ మెచ్చేలా ప్రమోషన్లు చెయ్యాలని ఫిక్స్ అయ్యింది టీమ్. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టిన జైశ్రీరామ్ తోనే ఆ పని స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో వచ్చి అందర్నీ మెప్పించింది. తాజాగా నేడు ఈ జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ముంబైలో లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి ఈవెంట్ నిర్వహించి పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు అజయ్ అతుల్ సంగీతం వహించారు. ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఈ పాటను వినేయండి.