Kaithi 2 : ఖైదీ సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన కార్తీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్..

ఖైదీ 2 గురించి అప్డేట్ ఇచ్చిన కార్తీ. లియో మూవీ తరువాత ఈ సినిమానే..

Kaithi 2 : ఖైదీ సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన కార్తీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్..

Japan Movie star Karthi Lokesh Kanagaraj Kaithi 2 update

Kaithi 2 : తమిళ్ హీరో కార్తీ (Karthi), లోకేష్ కానగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ ‘ఖైదీ’. 2019లో రిలీజ్ అయిన ఈ చిత్రం కోలీవుడ్ అండ్ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఇక ఈ మూవీ ఎండింగ్ లోనే సెకండ్ పార్ట్ కి కూడా హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. దీంతో ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల లోకేష్ తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమాలో ఖైదీ సినిమాలోని కార్తీ పాత్రని పరిచయం చేసి సెకండ్ పార్ట్ పై మరింత ఆసక్తిని కలగజేశాడు.

Leo vs Pushpa 2 : 32 నిమిషాల్లోనే ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ చేసిన విజయ్ ‘లియో’..

ప్రస్తుతం లోకేష్ కానగరాజ్.. లియో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. వచ్చే నెల అక్టోబర్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తరువాత రజినీతో ఒక సినిమా చేయబోతున్నాడు. దాని తరువాత ఖైదీ 2 పట్టాలు ఎక్కించనున్నట్లు సమాచారం.తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తీ ఈ సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ పార్ట్ 2 కి సంబంధించిన పనులు మొదలైనట్లు తెలియజేశాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని పేర్కొన్నాడు. ఇక కార్తీ కామెంట్స్ తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Suriya – Karthi : అన్నయ్యతో కలిసి సినిమా పై కార్తీ కామెంట్స్.. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..

కాగా ఈ సీక్వెల్ లో సూర్య (Suriya) కూడా కనిపించే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఢిల్లీ అండ్ రోలెక్స్ ఈ సీక్వెల్ లో కనబడి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తారో లేదో చూడాలి. ఇక కార్తీ ప్రస్తుతం నటిస్తున్న సినిమా విషయానికి వస్తే.. ‘జపాన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి అయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటీవల కార్తీ తన డబ్బింగ్ ని పూర్తి చేశాడు. దీపావళికి ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు.