జాన్ అబ్రహాం – సత్యమేవ జయతే 2

జాన్ అబ్రహాం, దివ్యా కోశ్లా కుమార్ జంటగా, మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సత్యమేవ జయతే 2'.. 2020 అక్టోబర్ 2 విడుదల..

  • Edited By: sekhar , September 27, 2019 / 08:12 AM IST
జాన్ అబ్రహాం – సత్యమేవ జయతే 2

జాన్ అబ్రహాం, దివ్యా కోశ్లా కుమార్ జంటగా, మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సత్యమేవ జయతే 2’.. 2020 అక్టోబర్ 2 విడుదల..

జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ 2018 ఆగస్టు 15న విడదలై విజయం సాధించింది. ఇప్పుడు సత్యమేవ జయతే కాంబినేషన్‌లో ‘సత్యమేవ జయతే 2’ రూపొందనుంది. రీసెంట్‌గా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్..

జాన్ అబ్రహాం, దివ్యా కోశ్లా కుమార్ జంటగా, మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వంలో.. టీ-సిరీస్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై.. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మోనీషా అద్వాణీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వాణీ నిర్మించనున్నారు.

Read Also : ‘ఉండిపో ఉండిపో’ వీడియో సాంగ్..

సత్యమేవ జయతే చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేస్తే, సత్యమేవ జయతే 2 మూవీని  గాంధీ జయంతి సందర్భంగా 2020 అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.