IND vs AUS : శతక్కొట్టిన రోహిత్ శర్మ, కోహ్లీ హాఫ్ సెంచరీ.. మూడో వన్డేలో ఆసీస్ పై భారత్ ఘన విజయం..
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో (IND vs AUS) భారత్ ఘన విజయం సాధించింది.
IND vs AUS Team India won by 9 wickets against Australia in 3rd Odi
IND vs AUS : సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(121 నాటౌట్; 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. విరాట్ కోహ్లీ (74 నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్‌మన్ గిల్ (24) పర్వాలేనిపించాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు.
237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 69 పరుగులు జోడించిన తరువాత హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో గిల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత వన్‌డౌన్‌లో కోహ్లీ వచ్చాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరుగుల ఖాతా తెరవని ఈ స్టార్ ఆటగాడు ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు.
Rohit Sharma : మూడో వన్డేలో ఆసీస్ పై రోహిత్ శర్మ సెంచరీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 శతకాలు..
రో-కో ద్వయం ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. రోహిత్ శర్మ 63 బంతుల్లో, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో అర్ధశతకాలను అందుకున్నారు. హాఫ్ సెంచరీ తరువాత మరింత దూకుడును పెంచిన రోహిత్ శర్మ 105 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. వన్డేల్లో హిట్‌మ్యాన్‌కు ఇది 33వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచరీ కావడం గమనార్హం. ఆ తరువాత కూడా ఈ జంట ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత్‌ను విజయతీరాలకు చేర్చింది.
A clinical bowling and fielding effort 👏
A magnificent partnership between 2️⃣ greats 🫡📸 Moments to cherish from #TeamIndia‘s 9️⃣-wicket victory in Sydney!
Updates ▶ https://t.co/omEdJjQOBf#AUSvIND | #3rdODI pic.twitter.com/uK7BJJeAUT
— BCCI (@BCCI) October 25, 2025
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (56; 58 బంతుల్లో 2 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు ఒక్కొ వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో (IND vs AUS ) భారత్ గెలిచినప్పటికి కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
