Jr NTR: ఫిబ్రవరిలో ఒకటి.. అక్టోబర్‌లో మరొకటి!

మూడేళ్ల నుంచి ఒక్క సినిమాకే అంకితమై పోయిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఇప్పుడు జూలు విదిల్చి.. ఒకేసారి తన అప్ కమింగ్ మూవీ షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. కొరటాలతో ఒక్కసారి..

Jr NTR: ఫిబ్రవరిలో ఒకటి.. అక్టోబర్‌లో మరొకటి!

Jr NTR: మూడేళ్ల నుంచి ఒక్క సినిమాకే అంకితమై పోయిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఇప్పుడు జూలు విదిల్చి.. ఒకేసారి తన అప్ కమింగ్ మూవీ షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. కొరటాలతో ఒక్కసారి సెట్ మీదకెళితే.. సినిమా కంప్లీట్ చేసే వరకూ తగ్గేది లేదంటూనే.. ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే పాన్ ఇండియా సినిమా షెడ్యూల్ కూడా రివీల్ చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ మూడేళ్ల నుంచి ఒకే సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్లో చరణ్, తారక్ హీరోలుగా తెరకెక్కుతున్న ట్రిపుల్ సినిమా స్టార్ట్ అయ్యిన దగ్గరనుంచి ఎన్టీఆర్ వేరే సినిమా జోలికి వెళ్లలేదు.

Cine Love Couples: పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు!

ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో తారక్ కూడా నెక్ట్స్ సినిమాల లైనప్ మీద హింట్ ఇచ్చారు. ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద క్లారిటీ ఇచ్చాడు. కొరటాల శివతో ఆల్రెడీ ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఈ సంవత్సరం పట్టాలెక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడు. నవంబర్, డిసెంబర్ నాటికి సినిమా స్టార్ట్ చేసి సమ్మర్ కి రిలీజ్ చేస్తారని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు, కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల సినిమా షూటింగ్ ని ఫిబ్రవరి వరకూ పోస్ట్ పోన్ చేశాడు.

Raai Laxmi: హాట్ బ్యూటీ ‘రత్తాలు’ అందాల వల!

కొరటాల శివతో ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేసి సెప్టెంబర్ కి.. మ్యాగ్జిమమ్ 7,8 నెలల్లో సినిమా కంప్లీట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న ఎన్టీఆర్.. అక్టోబర్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కబోతోంది. భారీ బడ్జెట్ తో మ్యాసివ్ ఎలివేషన్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా 2023 సమ్మర్ కి కంప్లీట్ చెయ్యాలని ఫిక్సయ్యాడు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్.