RRR First Review : RRR ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

ఎన్టీఆర్ కు ఈ మూవీతో నేషనల్ అవార్డ్ రావడం ఖాయం. ఇది ఎన్టీఆర్ కు గేమ్ ఛేంజర్ లాంటి సినిమా. రామ్ చరణ్ టెర్రిఫిక్ ఫామ్ లో ఉన్నాడు....

RRR First Review : RRR ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

Rrr First Review

RRR First Review : రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన RRR(రైజ్-రోర్-రివోల్ట్.. రౌద్రం.. రణం.. రుధిరం) మూవీ ఫస్ట్ రివ్యూ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కోట్లాది మంది రివ్యూ కోసం ఎదురుచూడకుండా.. సినిమాను నేరుగా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.

అందుకే.. మొదటి ఆటలు, ప్రీమియర్లకు మునుపెన్నడూ లేని డిమాండ్ తో వేగంగా బుక్ అయిపోయాయి. ఎవరెన్ని చెప్పినా.. సినిమా ఎలా ఉందనే మాట అందరిలోనూ ఆసక్తిని పెంచేదే. అలా.. SS రాజమౌళి మాస్టర్ పీస్ అయిన RRRకు వస్తున్న ఫస్ట్ రివ్యూ టాక్ ఏంటో చూద్దాం.

Read This : RRR: టార్గెట్ 2 వేల కోట్లు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ట్రిపుల్‌ఆర్?

మార్చి 25, 2022 నాడు ప్రపంచవ్యాప్తంగా RRR రిలీజవుతోంది. మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ ను ఫ్యాన్స్ ఈగర్ గా వాచ్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం RRR అప్ డేట్స్ తో షేకవుతోంది. అథెంటిక్ గా కనిపించిన ఓ రివ్యూను ఓసారి డిస్కస్ చేద్దాం.

యూకే, యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్, USAలో ఇండియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, సినిమా విమర్శకుడు అయిన ఉమెయిర్ సంధు(Umair Sandhu) RRRను రివ్యూ చేస్తూ.. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు, స్టేటస్ లు పెట్టారు. అవి క్రెడిబుల్ గా ఉండటంతో.. బాగా వైరల్ అవుతున్నాయి. RRRకు ఫైవ్ స్టార్స్ ఇస్తూ ఆయన తన రివ్యూను పోస్ట్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

“జూనియర్ ఎన్టీఆర్ కు ఈ మూవీతో నేషనల్ అవార్డ్ రావడం ఖాయం. ఇది ఎన్టీఆర్ కు గేమ్ ఛేంజర్ లాంటి సినిమా. రామ్ చరణ్ టెర్రిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. షో మొత్తాన్ని అతడు దున్నేశాడు. జూనియర్ ఎన్టీఆర్-చరణ్ లది డెడ్లీ కాంబో. నేను వాళ్లిద్దరికీ అభిమానినే. అజయ్ దేవగణ్ సర్ ప్రైజ్ ప్యాకేజీ ఇచ్చాడు. అతడికిచ్చిన పాత్రను అతడు వందశాతం న్యాయం చేశాడు. ఆలియా భట్ తన పాత్రలో మెరిసిపోయింది. మూవీలో ఆలియా భట్ చాలా అందంగా కనిపించింది. సెన్సార్ బోర్డ్ నుంచి RRR రివ్యూ ఇస్తున్నా”నంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఉమెయిర్ సంధు.

RRR గ్లింప్స్, ఒపీనియన్స్ ను కూడా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు ఉమెయిర్ సంధు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హైలైట్ అంటూ పొగిడారు ఈ ఫిలిం క్రిటిక్. మూవీని చూసి షాకైనట్టుగా తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఓ ఇండియన్ ఫిలిం మేకర్ RRR స్థాయిలో కల కనడం.. దాన్ని సెల్యూలాయిడ్ పైకి తీసుకురావడం అనేది.. భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తుందన్నాడు. ఈ మూవీని ఎవ్వరు కూడా మిస్ కాకూడదన్నారు. ఇప్పుడు ఈ మూవీని బ్లాక్ బస్టర్ గా చెప్పుకున్నా కూడా.. రానున్న రోజుల్లో క్లాసిక్ గా నిలిచిపోతుందన్నారు ఉమెయిర్ సంధు.

Umair Sandhu

Umair Sandhu

RRR మూవీ క్లైమాక్స్ అందరికీ ఓ షాక్ ఇస్తుందన్నారు ఉమెయిర్ సంధు. ఫస్టాఫ్ కన్నా.. సెకండాఫ్ అల్టిమేట్ సర్ ప్రైజ్ ఇస్తుందన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పెర్ఫామెన్స్ కు స్టాండింగ్ ఒవేషన్ లభిస్తుందని ట్వీట్ చేశారు ఉమెయిర్ సంధు. స్టార్ డమ్, పర్సనాలిటీస్, యాక్టింగ్ క్వాలిటీస్ ఈ మూవీకి వారిని బెస్ట్ ఫిట్ గా మార్చాయన్నారు. మూవీలో వాళ్లిద్దరి మంచితనం, ఫ్రెండ్ షిప్, సోదర భావం ఎన్నటికీ గుర్తుండిపోతాయని చెప్పారు.

Umari Sandhu 2

Umari Sandhu 2

రివ్యూస్ సంగతి పక్కన పెడితే.. రిలీజ్ టైం దగ్గర పడుతున్నకొద్దీ చాలామంది మూవీ లవర్స్ లో RRR పూనకం మొదలైంది. గత రికార్డులను చెరిపేస్తూ ఇండియాలో హయ్యెస్ట్ థియేటర్లు, స్క్రీన్లలో RRR రిలీజ్ అవుతోంది. పలు ప్రపంచ దేశాల్లోనూ ప్రదర్శనకు రెడీ అయింది. అమెరికాలో అయితే.. రికార్డ్ స్థాయిలో ప్రీమియర్లు వేస్తున్నారు. యూఎస్ఏలో ఓరోజు ముందుగానే.. 24 మార్చి, 2022 నాడు వేస్తున్న ప్రీమియర్ షోలతో 2.5 మిలియన్ డాలర్ల బిజినెస్ జరగడం రికార్డుల పరంపరలో ఓ తురుఫుముక్కగా చెప్పుకుంటున్నారు.

Read This : RRR : అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. 450 కోట్లతో సరికొత్త రికార్డు..