ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ సందేశాలు: కరోనాని జయించాలి

  • Published By: vamsi ,Published On : March 16, 2020 / 05:13 PM IST
ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ సందేశాలు: కరోనాని జయించాలి

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదం కరోనా వైరస్.. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా లక్షల సంఖ్యలో బాధితులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బతుకుతున్నారు. ఇటీవల ఇండియాకు కూడా వచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికే 114మందికి సోకింది. అందులో ఇద్దరు చనిపోయారు కూడా. 

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా ఈ విషయంపై తెలుగు సినిమా హీరోలు కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు మేసేజ్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వీడియో రిలీజ్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన ఆరు సూత్రాలను ప్రజలందరూ పాటించాలంటూ వారు వీడియోలో ప్రజలను విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని నమ్మవద్దని, కోవిడ్ మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు,సూచనలను అందరు పాటించాలని కోరారు.

అలాగే యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కూడా కరోనా గురించి అవగాహన తెలిపేందుకు ఓ మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కరోనాతో యుద్ధం చెయ్యడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యి కరోనాపై జయించాలని ఇందుకోసం అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#COVID19

A post shared by Prabhas (@actorprabhas) on

కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం.. జన సమూహం ఉండే ప్రదేశాలైన థియేటర్స్, కాలేజీలు, స్కూల్లు, మాల్స్, క్లబ్స్, పబ్స్ వంటి వాటిని మార్చి 31 వరకు మూసి వేయాలని ఆదేశించింది. ప్రజలు కూడా సహకరించాలని ప్రభుత్వం కోరింది. కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్స్ అన్నింటిని రద్దు చేసుకుంది. 

Also Read | యజమాని భార్యతో పనోడి అక్రమ సంబంధం : సుపారీ హత్య