మిడతల దాడి వెనుక చాలా కథ ఉంది.. ప్రమాదాన్ని సూచిస్తున్న ఖురాన్, బైబిల్‌లు: బందోబస్త్ డైరక్టర్ 

  • Published By: Subhan ,Published On : May 28, 2020 / 10:51 AM IST
మిడతల దాడి వెనుక చాలా కథ ఉంది.. ప్రమాదాన్ని సూచిస్తున్న ఖురాన్, బైబిల్‌లు: బందోబస్త్ డైరక్టర్ 

దేశం కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మిడతల దండు మరో ప్రమాదాన్ని పట్టుకొస్తున్నాయి. ఉత్తరభారత దేశంలో ఇప్పటికే ఈ ప్రభావానికి పలు రాష్ట్రాల్లో పంటలు నాశనమైపోయాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఈ మిడతల దాడికి బాగా నష్టపోతున్నాయి. 50వేల హెక్టార్ల పంటభూమిని నాశనం చేశాయి. 

ప్రభుత్వం కంట్రోల్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. పెస్టిసైడ్స్ వేసి వాటిని కట్టడి చేస్తుండగా, కొందరు లౌడ్ స్పీకర్లతో మ్యూజిక్ ఏర్పాటు చేసి చెదరగొడుతున్నారు. అసలు ఈ మిడతల దండ యాత్ర అనేది దక్షిణ భారతంలో 2019లోనే పరిచయమైంది. తమిళ సినిమా కాప్పన్.. (తెలుగులో బందోబస్త్)మూవీలో సూరియా, మోహనల్ లాల్ లీడ్ రోల్స్ లో కనిపిస్తారు. 

ఆ సినిమాలో కనిపించే సీన్స్ నిజంగా జరుగుతున్నాయి. వీటిని డైరక్టర్ కేవీ ఆనంద్ ముందుగానే ఎలా పసిగట్టారు. అని అందరిలో ప్రశ్న మొదలైంది.. దీనిపై ఓ ఇంగ్లీషు మీడియాలో చేసిన ఇంటర్వ్యూలో డైరక్టర్ తన మనసులో మాట చెప్పారు. 

‘నాకు చాలా ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. ముందుగానే ఇటువంటి దాడుల గురించి ఊహించి సినిమా తీసినందుకు. కానీ, ఇది నాకు నచ్చడం లేదు. దీని పట్ల నేను సంతోషంగా లేను. ఇది దేశాన్ని పాడుచేస్తుంది. అవి పెరిగిపోక ముందే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని అడ్డుకోవాలి’ 

‘నేను 9 ఏళ్ల క్రితం మడగాస్కర్‌కు వెళ్లాను. సూర్య నటించిన బ్రదర్స్ ప్రీ పొడక్షన్ పనిలో భాగంగా లొకేషన్ చూడటానికి అక్కడికి వెళ్లాం. నా టీంతో కలిసి కారులో ట్రావెలింగ్ చేస్తుండగా వేలల్లో మిడతలు మాకు దగ్గర్నుంచే వెళ్లాయి. మాకు డ్రైవింగ్ చేయడం కష్టంగా మారింది. కొద్ది గంటల వరకూ అక్కడే ఆగిపోయాం. ఆ తర్వాత స్థానికులను వాటి గుంపుల గురించి అడిగి తెలుసుకున్నాం. ఆ ఆలోచనను డెవలప్ చేసుకుని బందోబస్త్ మూవీలో పెట్టాం’ 

‘ఈ సినిమా మొదలుపెట్టకముందే వాటిపై రీసెర్చ్ చేశాం. బైబిల్, ఖురాన్ లో వాటి గురించి చాలా రిఫరెన్సులు ఉన్నాయి. ఈ మిడతలు వలసపోయేవారు, ప్రజల మనుగడపై చాలా మార్పులు తీసుకొచ్చాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కీటకాలు పెద్ద సంఖ్యలో ఎలుకలను ఆకర్షించి తద్వారా జబ్బును విస్తృతం చేస్తాయి. ఈ మిడతల దాడికి ముంబై ప్రత్యక్ష సాక్ష్యం. 1903 నుంచి 1906లో ఇలా జరిగింది. చరిత్ర ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం వెంటనే అలర్ట్ అయి వాటిని కంట్రోల్ చేయాలి’

వీటిని కంట్రోల్ చేయడానికి స్టెరైల్ ఇన్‌సెక్ట్ టెక్నిక్ వాడి మిడతల వ్యాప్తిని నియంత్రించవచ్చు. ‘ఇందులో భాగంగా స్టైరిలైజ్ అయిన మగ మిడతలను వదిలి ఆడ పురుగులతో కలిసే విధంగా చూడాలి. వాటి కలయికలో అప్పుడు మిడతలు పుట్టవు. సాధారణంగా ఈ టెక్నిక్ ను దోమలు నియంత్రించడం కోసం వాడతారు’ అని సూచించారు కేవీ ఆనంద్. 

Read: రాయదుర్గంలో మిడతల కలకలం.. 10 నిమిషాల్లో జిల్లేడు చెట్టు ఆకులన్నీ తినేశాయి