Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్....

Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?

Kamal Haasan Vikram Locks Runtime

Vikram: యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు లోకేశ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Vikram: హైప్ పెంచుతున్న కమల్.. స్పీడందుకున్న ప్రమోషన్స్!

ఈ సినిమాలో కమల్ హాసన్ మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో అదిరిపోయే క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాలో కమల్‌తో పాటు మరికొందరు స్టార్ యాక్టర్స్ నటిస్తుండటంతో విక్రమ్ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ మూవీ రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 2 గంటల 58 నిమిషాలుగా లాక్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఓ కమర్షియల్ సినిమాకు ఇది చాలా లెంగ్తీ రన్‌టైమ్ అనే చెప్పాలి.

Vikram: విక్రమ్ ట్రైలర్ టాక్.. పదా.. చూసుకుందాం!

అయితే సినిమాపై కాన్ఫిడెన్స్‌తోనే విక్రమ్ చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అంతేగాక, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన లాస్ట్ మూవీ మాస్టర్ చిత్రానికి కూడా ఇలాంటి లెంగ్తీ రన్‌టైమ్‌ను పెట్టి, ఆ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే స్ట్రాటెజీతో లోకేశ్ విక్రమ్ సినిమాకు రన్‌టైమ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, తమిళ స్టార్ హీరో సూర్య ఓ కీలక పర్ఫార్మెన్స్ ఇస్తున్న విక్రమ్ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీస్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ను చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి విక్రమ్ చిత్రానికి లెంగ్తీ రన్‌టైమ్ ఎంతమేర కలిసొస్తుందో చూడాలి.