AP Cinema Ticket Price Issue : సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం మంచిదే

తాజాగా సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఆంధ్రప్రదేశ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి.........

AP Cinema Ticket Price Issue : సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం మంచిదే

Kethireddy

AP Cinema Ticket Price Issue :   గత కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల, థియేటర్ల పట్ల, సినిమా టికెట్ రేట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను చాలా మంది సినీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల విధానంలో తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం సినీ పరిశ్రమలో ఉంటూనే ఈ నిర్ణయంపై సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

తాజాగా సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ఆంధ్రప్రదేశ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. నిన్న ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా–అందరికీ అందుబాటులో సినిమా టికెట్లు’ అనే అంశం మీద ఒంగోలు వీకేబీ ఫంక్షన్‌ హాల్లో చర్చా వేదిక నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులపై అధిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. పెద్ద హీరోలు, నిర్మాతల ధన దాహంతో తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. సినీ పెద్దలు కొందరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లను లీజుకు తీసుకుని సాధారణ థియేటర్లకు సైతం మల్టిప్లెక్స్ కలరింగ్‌ ఇచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని” ఆరోపించారు. షోలను నియంత్రించడం, ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం లాంటి ప్రభుత్వ నిర్ణయాలను ప్రేక్షకులు సంతోషంగా స్వాగతిస్తున్నారని చెప్పారు.