Kiara-Sidharth : కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారా??

బాలీవుడ్ లో ప్రజెంట్ అందరూ మాట్లాడుకొనే మెయిన్ టాపిక్ కియారా, సిద్దార్ధ్ ల పెళ్లి. దాని గురించి అభిమానుల్లో ఓ రేంజ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. బాలీవుడ్ మీడియాలో ఇప్పటికే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ గురించి............

Kiara-Sidharth : కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోబోతున్నారా??

 

Kiara-Sidharth :  బాలీవుడ్ లో ప్రజెంట్ అందరూ మాట్లాడుకొనే మెయిన్ టాపిక్ కియారా, సిద్దార్ధ్ ల పెళ్లి. దాని గురించి అభిమానుల్లో ఓ రేంజ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. బాలీవుడ్ మీడియాలో ఇప్పటికే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ ప్రజెంట్ రామ్ చరణ్, శంకర్ కాంబో మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా చాలానే ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడుపుతున్నట్టు ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. రీసెంట్ గా కరణ్ జోహార్ షోలో కూడా కియారా తమ లవ్ ఎఫైర్ పై ఇండైరెక్ట్ గా స్పందించి కన్ ఫర్మ్ చేసింది.

2023 బిగినింగ్ లో కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా మ్యారేజ్ చేసుకుంటారని, అది కూడా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ లా సీక్రెట్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఇరు కుటంబాలు ప్లాన్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే సిద్దార్థ్ మల్హోత్రా మాత్రం తానెంత సీక్రెట్ గా వివాహం చేసుకున్నా అది బయటికి వచ్చేస్తుంది అంటూ ఇటీవల ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.

Aryan Khan : షారుఖ్ తనయుడి ఎంట్రీ ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన ఇచ్చేసిన నిర్మాణ సంస్థ..

సిద్ధార్ధ్ మల్హోత్రా ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటుంది. అందుకే పెళ్ళిని చండిఘర్ లో చేసుకోవాలని డిసైడయ్యారని టాక్. ఫ్యాన్స్ ఈ ఇద్దరి అఫీషియల్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి పెళ్ళి ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి 2023లో కియారా, సిద్దార్ధ్ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు.