Kiara Advani: చరణ్ సినిమాను కియారా అందుకే ఒప్పుకుందా..?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’...

Kiara Advani: చరణ్ సినిమాను కియారా అందుకే ఒప్పుకుందా..?

Kiara Advani Signed Rc15 For These Reasons

Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ఆ తరువాత మళ్లీ బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా కియారా అద్వానీ నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో, కియారా ఇక బాలీవుడ్‌కే పరిమితం అయ్యింది.

Kiara Advani : అప్పుడు చావుని దగ్గర్నుంచి చూశాను.. అదృష్టం వల్ల బతికానేమో..

ఇప్పుడు మళ్లీ తెలుగులో ఈ అమ్మడు సినిమా ఓకే చేసింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 సినిమాలో కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఆమె ఈ సినిమాను ఓకే చేసేందుకు అనేక కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటం మొదటి కారణం అయితే.. ఆయన తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే గుర్తింపు వస్తుందట. అంతేగాక.. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనుండటం, అమ్మడికి పారితోషకం కూడా భారీగానే అందనుండటంతో ఈ సినిమాలో నటించేందుకు కియారా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..

మొత్తానికి కియారా అద్వానీ మళ్లీ తెలుగు సినిమా చేస్తుందని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఆమె ఈ సినిమాను ఒప్పుకునేందుకు తన లెక్కలు తాను వేసుకుంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.